»Customs Officials Arrested A Passenger To Attempt Smuggle 10 Yellow Anacondas At Kia
Anaconda : బెంగళూరు ఎయిర్ పోర్టులో కస్టమర్ బ్యాగులో 10 ఆనకొండలు
బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కిఐఏ) నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వస్తోంది. ఇక్కడ కస్టమ్స్ అధికారులు పాములను బ్యాగులో పెట్టుకుని అక్రమ రవాణాకు యత్నిస్తున్న ఓ స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు.
Anaconda : బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కిఐఏ) నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వస్తోంది. ఇక్కడ కస్టమ్స్ అధికారులు పాములను బ్యాగులో పెట్టుకుని అక్రమ రవాణాకు యత్నిస్తున్న ఓ స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు. సెర్చింగ్ బృందం వ్యక్తి బ్యాగ్ నుండి సుమారు 10 అనకొండ పాములను పట్టుకుంది. దీని తర్వాత ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బెంగళూరు కస్టమ్స్ ట్విటర్లో ట్వీట్ చేసింది. బెంగళూరు కస్టమ్స్ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాను సహించేది లేదని అధికారులు పేర్కొన్నారు.
బ్యాంకాక్ నుంచి వన్యప్రాణుల అక్రమ రవాణా ప్రయత్నాన్ని అధికారులు పట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు జనవరి 2022లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బ్యాంకాక్ నుండి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వద్ద ముగ్గురు ప్రయాణీకులను ఆపి, వారి నుండి 18 జంతువులను (4 ప్రైమేట్స్, 14 పాములు) స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు తమ చెక్-ఇన్ బ్యాగేజీలో జంతువులను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. ఆగష్టు 2022 లో, కస్టమ్స్ అధికారులు ట్రాలీ బ్యాగ్లో దాచిన కంగారూ శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, కొండచిలువలు, ఊసరవెల్లులు, ఇగువానాస్, తాబేళ్లు, మొసళ్లతో సహా 234 సరీసృపాలు తీసుకువెళుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు.