»Airasia Flight To Hyderabad Left Karnataka Governor Thawar Chand Gehlot At Bangalore Airport
Flight: గవర్నర్ ను వదిలివెల్లిన విమానం..తర్వాత
ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ ను పట్టించుకోకుండానే విమానం వెళ్లిపోయింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆయన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు గవర్నర్ సిబ్బంది కూడా దీనిపై ఫిర్యాదు చేశారు.
The Airsea flight left Karnataka Governor and left for Hyderabad
Thawar Chand Gehlot: బెంగళూరు(Bangalore)లో కెంపేగౌడ అంతార్జాతీయ విమానాశ్రమం(Kempegowda International Airport)లో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్(Karnataka Governor Thawar Chand Gehlot)ను ఎక్కించుకోకుండానే ఎయిరేసియా(Airasia) విమానం టేకాఫ్ అయింది. ఈ ఘటన జూలై 27, గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గవర్నర్ టెర్మినల్‌కు చేరుకోవడంలో ఆలస్యమైందని ఎయిర్‌లైన్స్ చెబుతుండగా, గవర్నర్ విమానాశ్రయ లాంజ్‌లో వేచి ఉన్నారని అధికారులు చెబుతున్నారు. గవర్నర్ ను ఎక్కించుకోకుండా విమానయాన సంస్థ ప్రోటోకాల్ ను ఉల్లంఘించిందని అధికారులు అన్నారు.
గవర్నర హైదరాబాద్ వెళ్లడానికి గురువారం మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. వీఐపీ లాన్ నుంచి టర్మినల్ 2కు చేరుకునేలోపు విమానం హైదరాబాద్‌కు బయలు దేరింది. అప్పటికే ఆయన లగేజీని కూడా ఎయిరేసియాలో ఎక్కించారు. అయినా సరే విమానం టేకాఫ్ అయినట్లు అధికారులు తెలిపారు. గవర్నర్ చేరుకోవడం ఆలస్యం అయినందున విమానం వెళ్లిపోయిందని ఎయిరేసియా సిబ్బంది అన్నారు. గవర్నర్ ప్రోటోకాల్ టీమ్ అధికారి తెలిపిన ప్రకారం.. గవర్నర్ వస్తున్నట్లు ఎయిర్పోర్ట్ సిబ్బందికి సమాచారం ఉందని, అందుకనే ఆయన కూడా మధ్యాహ్నం గం.1.30కు విమానాశ్రయానికి చేరుకున్నారని, టెర్మినల్ 1లోని వీవీఐపీ లాంజ్‌లో వేచి ఉన్నారన్నారు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారి తెలిపారు. దీనిపై ఎయిరేషియా సిబ్బంది స్పందిస్తూ.. మధ్యాహ్నం 2:05 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. గవర్నర్ మధ్యాహ్నం 2:06 గంటలకు టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి చేరుకున్నారు. అందుకనే ప్లయిట్ వెళ్లిపోయిందన్నారు. విమానం మధ్యాహ్నం గం.2.27కు బయలు దేరింది. గవర్నర్ ను అక్కడే వదిలేసి ఎయిర్‌లైన్స్ సిబ్బంది టేకాఫ్ అయిందని ప్రోటోకాల్ ఆఫీసర్ అన్నారు. ఈ ఘటన తర్వాత 90 నిమిషాల అనంతరం మరో విమానంలో గవర్నర్ హైదరాబాద్ చేరుకున్నారు.
ఎయిరేసియా సిబ్బందిపై ప్రోటోకాల్ అధికారులు విమానాశ్రయంలో ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారొకరు మీడియాకు వెల్లడించారు. దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. గవర్నర్ కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఇందుకు క్షమాపణలు చెబుతున్నామని ఎయిరేసియా ప్రకటించింది. దర్యాఫ్తు చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. వృత్తి పరంగా అత్యున్నత ప్రమాణాలు, ప్రోటోకాల్ కు కట్టుబడి ఉండటానికే ప్రాధాన్యతనిస్తామని తెలిపింది.