Gold Rates Today : వరుసగా రెండో రోజూ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ వచ్చిన వెండి బంగారం ధరలు సోమ, మంగళవారాల్లో తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. నేడు ఏ లోహం ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. గత కొంత కాలంగా బంగారం ధర భారీగా పెరగడం, స్వల్పంగా అప్పుడప్పుడూ తగ్గడం అన్నట్లుగానే ట్రెండ్ నడిచింది. అయితే సోమవారం అరవెయ్యికి పైగా తగ్గిన దీని ధర మంగళవారం ఏకంగా రూ.1,677 తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.73,845కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.73,845గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate)లు ఇటీవల కాలంలో భారీగా పెరిగి రూ.86 వేల మార్కును చేరుకున్న విషయం తెలిసిందే. అయితే సోమ, మంగళవారాల్లో దీని ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఒక్క రోజే కిలో వెండి ధర ఏకంగా రూ.2.468 తగ్గింది. దీంతో నేటి మార్కెట్లో దీని ధర
రూ.82,485కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి భారీగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం భారీగా తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ ధర మంగళవారం 67 డాలర్లు తగ్గి, 2,303 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి దర 26.96 డాలర్లుగా కొనసాగుతోంది.