200 ఏళ్ల తర్వాత భారతదేశానికి శివాజీ ఉపయోగించిన పులి పంజా(Wagh Nakh) ఆయుధం తిరిగి రానుంది. ప్రతాప్ గఢ్ యుద్ధంలో ఉపయోగించిన కీలకమైన ఈ ఆయుధాన్ని శివాజీ ఉపయోగించి ప్రత్యర్థులను మట్టుబెట్టాడు. ఆ తర్వాత అనేక రాజ్యాలను కైవసం చేసుకున్నారు.
PM MODI కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2023 మార్చి 31 వరకు భారత ప్రభుత్వం రూ.155 లక్షల కోట్ల అప్పులు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 2013లో జరిగిన మత అల్లర్లకు సంబంధించిన కేసులో కోర్టు తన తీర్పును వెలువరించింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఎనిమిది మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కాగా, విచారణ సమయంలో ఒక నిందితుడు మరణించాడు. సీనియర్ డిఫెన్స్ న్యాయవాది ప్రదీప్ మాలిక్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 8, 2013న ఫుగానా పోలీస్ స్టేషన్ పరిధిలోని లిసాద్ గ్రామంలో మతపరమైన అల్లర్లు చెలరేగాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిన ఉగ్రవాద (నార్కో-టెర్రర్) కుట్రను పోలీసులు ఛేదించారు. వాహనం నుండి 30 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లో సాంకేతిక లోపంతో భోపాల్ సమీపంలోని మైదాన ప్రాంతంలో హెలికాప్టర్‌ను సేఫ్ ల్యాండ్ చేశారు.
ఈవీ వెహికిల్స్ కొనుగోలు చేయాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. కానీ ఓలా బైక్స్ పేలడంతో జనం ఆలోచనంలో పడ్డారు. ఇప్పుడు బెంగళూరులో ఓ కారు పేలింది.
వంట గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. సిలిండర్ రేటు భారీగా పెరిగింది.
తమిళనాడులో నీలగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు
ఆదిత్య ఎల్1 మిషన్‌పై ఇస్రో కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆదిత్య ఎల్1 సూర్యునికి చేరువ కానుందని, ఈ మిషన్ విజయవంతంగా దూసుకెళ్తోందని ఇస్రో వెల్లడించింది.
స్కూల్ టీచర్లు ఇన్‌స్టా రీల్స్‌కు అలవాటు పడటంతో విద్యార్థులు పాఠాలకు దూరమయ్యారు. అయితే తమ రీల్స్ చూసి లైక్ చేయాలని టీచర్లు వేధింపులకు గురి చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. చివరికి ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు కాస్తా రంగంలోకి దిగి పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్(Vande Bharat trains) ప్రయాణీకులకు సమయానికి అందుబాటులో ఉండే విధంగా రైల్వే శాఖ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లను 14 నిమిషాల్లోనే శుభ్రం(cleaning) చేసి తర్వాత ప్రయాణానికి సిద్ధం చేయనున్నట్లు తెలిపింది.
బీహర్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్ వల్ల ఓ అంబులెన్స్ గంట పాటు ఆగింది. అందులో ఓ చిన్నారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తమకు దారి ఇవ్వాలని ఆ చిన్నారి తల్లి వేడుకున్న పోలీసుల మనసు కరగలేదు.
ఢిల్లీలో ముగ్గురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాక్కున్నట్లు తెలుస్తోంది. వారు ఢిల్లీలోనే ఉన్నారా లేదా దేశంలో మరే ప్రాంతంలోనైనా తలదాచుకున్నారా అని అధికారులు అనుమానిస్తున్నారు.
ఉగ్రవాదులపై భద్రతా బలగాల ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. నిర్దిష్ట సమాచారం మేరకు కుప్వారాలోని మచిల్ సెక్టార్‌లోని కుంకడి ప్రాంతంలో సైన్యం, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో సరిహద్దు దాటి వస్తున్న ఇద్దరు చొరబాటుదారులను భద్రతా దళాలు హతమార్చాయి.
మధ్యప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి రావాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చాలా బహిరంగ సభలను నిర్వహిస్తోంది. పార్టీ సీనియర్ నాయకులు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.