తమిళనాడులో నీలగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్టు పర్యాటకులతో వెళ్తున్న బస్సు (Tourist Bus) నీలగిరి ఘాట్ రోడ్డులోని కూనూర్ (Coonoor) సమీపంలో అదుపుతప్పి లోయలో (Gorge) పడిపోయింది. దీంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులు 55 మంది పర్యాటకులు ఉన్నారని అధికారులు చెప్పారు. కూనూరు-వేటుపాళ్యం మద్య ఘాట్రోడ్డులో ఉన్న మూల మలుపు (Hairpin bend) వద్ద బస్సుపై డ్రైవర్ పట్టు కోల్పోయాడని (Lost control), దీంతో అది 50 అడుగుల లోతైన లోయలో పడిపోయిందని వారు తెలిపారు.
వారంతా ఊటికి (OoTy) వెళ్లి తెన్కాశీకి (Tenkasi) తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నదని జిల్లా ఎస్పీ కే. ప్రభాకర్ (SP K Prabhakar) వెల్లడించారు.సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50 వేల చొప్పులన అదింస్తామన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.