భారత వాయుసేన (Indian Air Force)కు చెందిన ఓ హెలికాప్టర్ అత్యవసర పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్ ఓ వ్యవసాయ క్షేత్రంలో ల్యాండ్ అయింది. సమీపంలో ఆ సమయంలో హెలికాప్టర్లో ఆరుగురు ఉన్నారు. వీరంతా సురక్షితంగానే ఉన్నట్లు వాయుసేన ఓ ప్రకటనలో పెర్కోన్నారు. దారి తప్పుతున్న విమానాలు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?భారత వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్ (ALH MK III) రోజువారీ శిక్షణలో భాగంగా భోపాల్ నుంచి చకేరీకి బయల్దేరింది. మార్గమధ్యలో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. భోపాల్ జిల్లా డుంగరియా గ్రామ సమీపంలోని చెరకు తోటలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది.
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ మేరకు సమాచారం అందుకున్న వాయుసేన (Air force) బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సాంకేతిక లోపాన్ని సరిదిద్దే పనిలో నిమగ్నమైంది. నాగ్‌పుర్ (Nagpur) నుంచి మరో నిపుణుల బృందం రానున్నట్లు పోలీసులు వెల్లడించారు. హెలికాప్టర్లో ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉన్నారు. భోపాల్(Bhopal)కు 60 కిలోమీటర్ల దూరంలోని బెరాసియా గ్రామంలో అత్యవసర ల్యాండింగ్ జరిగింది.హెలికాప్టరులో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు నిపుణుల బృందం హెలికాప్టరు దిగిన ప్రాంతానికి రానుంది. భారత వైమానికి దళానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ ఎంకే 3 హెలికాప్టర్ (Helicopter) మిషన్ లో భాగంగా భోపాల్ నుంచి చకేరీకి వెళుతుండగా భోపాల్ విమానాశ్రయం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో దుంగరియా ఆనకట్ట సమీపంలో సురక్షితంగా ముందుజాగ్రత్తగా ల్యాండింగ్ చేశారు.
#WATCH | Madhya Pradesh: An Indian Air Force ALH Dhruv helicopter made a precautionary landing near Bhopal. As per the initial reports, the crew is safe and a team is on the way to look into the technical issues: IAF sources pic.twitter.com/cQRxCrJjzK