మహారాష్ట్రం నాందేడ్ ఎంపీ హేమంత్ పాటిల్ (MP Hemant Patil) వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రి సందర్శించారు. అయితే ఆ ఆస్పత్రిలోని టాయిలెట్ (Toilet) శుభ్రంగా లేకపోవడంతో కోపంతో ఊగిపోయిన ఎంపీ.. ఆ ఆస్పత్రి డీన్ శ్యామ్ రావ్ (DeanShyamRao)వకోడాతో శుభ్రం చేయించారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన వేళ.. ఎంపీ హేమంత్ పాటిల్ ఆ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి(Hospital)లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించగా.. అక్కడి ఉన్న టాయిలెట్ అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.
దీంతో వెంటనే డీన్‌ను పిలిపించి మందలించారు. ఆ తర్వాత డీన్‌తోనే టాయిలెట్‌ను శుభ్రం చేయించారు. డీన్ టాయిలెట్లు కడుగుతుంటే ఎంపీ హేమంత్ పాటిల్ అక్కడే ఉండి నీళ్ల పైపుతో నీళ్లను పోశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నాందేడ్ (Nanded) ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజుల్లోనే 31 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది తెలిసిందే.
నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో టాయిలెట్లు డీన్‌తో క్లీన్ చేయించడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA)ఖండించింది. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎంకు లేఖ రాసింది. ఆస్పత్రిలో 31. మంది మరణించిన నేపథ్యంలో శివసేన (Siva Sena) ఎంపీహేమంత్ పాటిల్ ఆస్పత్రిని సందర్శించి, డీన్‌తో టాయిలెట్స్ క్లీన్ చేయించారు. తన పరువుకు నష్టం కలిగించారని సదరు డీన్ (Dean) పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎంపీపై SC, ST, అట్రాసిటీ కేసు నమోదుచేశారు.
नांदेडमध्ये रुग्ण दगावले, त्याची जबाबदारी अधिष्ठाता यांची आहेच. त्याबद्दल डॉ.वाकोडे यांना उत्तरदायी ठरवलंच पाहिजे. पण त्यांना टॉयलेट साफ करायला लावून शिंदे गटाचे खासदार हेमंत पाटील यांनी काय साधलं? नांदेड रुग्णालयाची दुरवस्था होईपर्यंत हे महाशय कुठे होते? निव्वळ स्टंटबाजी… pic.twitter.com/scTeeoAjlh