»Massive Fire In Mumbai Seven Floor Building Seven Dead 40 Injured
Massive fire accident: ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు
ముంబైలోని ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
Massive fire in Mumbai seven floor building seven dead 40 injured
దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai) గోరేగావ్‌లోని ఓ ఏడంస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం(massive fire accident) సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో 40 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం దాదాపు తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ క్రమంలో పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా దగ్ధమయ్యాయి.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే చర్యలు ప్రారంభించారు. దీంతోపాటు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పార్కింగ్ ఏరియాలో ఉన్న ఓ గుడ్డకు ఆకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. తాను BMC, ముంబై పోలీసులతో ఘటన గురించి ఆరా తీసినట్లు చెప్పారు. అంతేకాదు క్షతగాత్రుల కుటుంబాలకు సాయం చేస్తామని చెప్పారు.