»Pm Modi Offers Prayers At Parvati Kund In Uttarakhand
PM Modi: కైలాస పర్వతం దర్శించుకున్న ప్రధాని మోడీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(modi) గురువారం ఉత్తరాఖండ్ లో ఆది కైలాస పర్వత శిఖరాన్ని దర్శనం చేసుకున్నారు. దీంతోపాటు పార్వతి కుండ్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
PM Modi offers prayers at Parvati Kund in Uttarakhand
ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం ఉత్తరాఖండ్(Uttarakhand) పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పితోర్ఘడ్ జిల్లాలోని పార్వతీ కుండ్(Parvati Kund) వద్ద పరమశివుడి దేవాలయాన్ని సందర్శించారు. స్థానిక సంప్రదాయ దుస్తుల్లో మోడీ అక్కడకు చేరుకుని పూజాధికాలు నిర్వహించారు. పూర్తి సంప్రదాయ గిరిజన దుస్తులను ధరించి జోలింగ్‌కాంగ్‌లోని పార్వతి కుండ్ ఒడ్డున ఉన్న శివ పార్వతి ఆలయంలో మోదీ ‘ఆరతి’ నిర్వహించి శంఖాన్ని ఊదారు. ఆ క్రమంలో మోడీకి స్థానిక పూజారులు వీరేంద్ర కుటియాల్, గోపాల్ సింగ్ మార్గనిర్దేశం చేశారు. ఆ క్రమంలో మోడీ ఆది కైలాస శిఖరం ముందు చేతులు జోడించి కొద్దిసేపు ధ్యానంలో కూర్చున్నారు.
అక్కడి నుంచి సరిహద్దు గ్రామమైన గుంజికి చేరుకున్న మోడీ అక్కడ స్థానికులు, భద్రతా సిబ్బందితో ముచ్చటించారు. స్థానిక ఉత్పత్తులు, కళాఖండాల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆయన వెంట ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఉన్నారు. కాగా నేటి పర్యటనలో మోడీ ఆ జిల్లాలో రూ.4200 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ(modi) పర్యటనతో కుమోన్ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యటన ఊపందుకుంటుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.