»The Police Took A Video Of The Nurse Taking A Bath In The Moradabad Hospital
Viral news: ఆస్పత్రిలో స్నానం చేస్తున్న నర్సు వీడియో తీసిన పోలీస్
ఆస్పత్రిలో సిబ్బంది, రోగులకు అండగా ఉండాల్సిన పోలీసు అధికారి అసహ్యంగా ప్రవర్తించాడు. ఓ నర్సు స్నానం చేస్తుండగా పోలీసు వీడియో తీశారని నర్సు వాపోయింది. అంతేకాదు అతని ఫోన్ చూపించమని అడిగితే పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
The police took a video of the nurse taking a bath in the moradabad hospital
ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్ ఆసుపత్రి(moradabad hospital)లో తాను స్నానం చేస్తుండగా ఓ పోలీసు అధికారి తన వీడియో చిత్రీకరించాడని ఓ నర్సు ఆరోపించింది. అయితే అతను ఆమె సహోద్యోగి నర్సు భర్త అని తెలుస్తోంది. ఆమె స్నానం చేస్తుండగా నిందితుడు అతని మొబైల్ ఫోన్లో వీడియో తీశాడని నర్సు తెలిపింది. ఈ ఘటన
అక్టోబర్ 10న ఉదయం 7 గంటల ప్రాంతంలో వాష్‌రూమ్‌లో స్నానం చేసేందుకు వెళ్లిన క్రమంలో జరిగిందని నర్సు ఆరోపించింది.
उत्तर प्रदेश के मुरादाबाद जिला अस्पताल की स्टाफ नर्स ने साथ काम करने वाली स्टाफ़ नर्स के पुलिसकर्मी पति पर MMS बनाने का आरोप लगाया है। नर्स का आरोप है कि पुलिसकर्मी ने नहाते समय उसका वीडियो बनाया। फ़िलहाल आरोपी पुलिसकर्मी को निलंबित कर दिया गया है। pic.twitter.com/kQIozmoQD6
స్నానం చేసి బట్టలు వేసుకోవడం మొదలు పెట్టేసరికి చేతిలో ఎవరో మొబైల్ ఫోన్ పట్టుకుని పైకి రికార్డింగ్ చేస్తూ కనిపించారని ఆమె తెలిపింది. బాధితురాలు వెంటనే బట్టలు వేసుకుని బయటకు వచ్చి ఎవరు వీడియో తీశారో చూసేందుకు బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా..బయట లాక్ చేసి ఉంది. ఆ క్రమంలో ఆమె మరో మహిళను తలుపు తెరవమని కోరింది. ఆమె తలుపు తెరిచి చూడగా.. సంఘటన స్థలంలో స్టాఫ్ నర్సు(nurse) భర్త అయిన పోలీసు కానిస్టేబుల్ ఉన్నారు. ఆ క్రమంలో కానిస్టేబుల్‌ను మొబైల్ ఫోన్ చూపించాలని ఆమె కోరగా..కానిస్టేబుల్ నిరాకరించి నర్సును తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేసింది.
ఈ ఘటన అనంతరం నిందితుడు పోలీస్ కానిస్టేబుల్ ఇంకా పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి మొబైల్‌ను స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిందితుడు మొరాదాబాద్‌లోని జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు అంజలీ దేవి భర్త అని తేలింది. కానిస్టేబుల్ వద్ద నుంచి ఫోన్ లాక్కుంటుండగా వీడియో డిలీట్ చేశారని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన పోలీస్ కానిస్టేబుల్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. విచారణలో ఆరోపణలు రుజువైతే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు(officers) వెల్లడించారు.