కేంద్ర ప్రభుత్వం రెండు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వందే భారత్ స్లీపర్ వెర్షన్‌గా వస్తున్న ఈ హైస్పీడ్ రైళ్లను అమృత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రారంభించనున్నారు.
Amrith Bharat Express: కేంద్ర ప్రభుత్వం రెండు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వందే భారత్ స్లీపర్ వెర్షన్‌గా వస్తున్న ఈ హైస్పీడ్ రైళ్లను అమృత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రారంభించనున్నారు. వీటి ప్రారంభోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు డిసెంబర్ 30న అయోధ్యలో ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. వీటిలో ఒకటి యూపీలోని అయోధ్య నుంచి బీహార్‌లోని దర్భంగా వరకు వెళ్తుండగా, రెండోది పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా-బెంగళూరు నుంచి ఏపీ మీదుగా ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఇవి గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.
అత్యాధునిక ఫీచర్లతో ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఈ రైళ్లను తీసుకొచ్చిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైళ్లలో ‘పుష్-పుల్’ వంటి అధునాతన సాంకేతికత ఉందని, దీని వల్ల రైళ్ల వేగం, ప్రయాణికుల సౌకర్యాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో LED లైట్లు, CCTVలు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి వివిధ సౌకర్యాలు ఉన్నాయి. రేపు అయోధ్యలో రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. పరీక్ష కోసం 4-5 నెలల పాటు టెస్ట్ రన్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.