»Chhattisgarh Cm Played Candy Crush During Congress Meeting
Meetingలో క్యాండీ క్రష్ ఆడిన సీఎం..బీజేపీ విమర్శలు
ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం భూపేశ్ భాగల్ క్యాండీ క్రష్ ఆడుతూ కనిపించారు. దీంతో బీజేపీ తన విమర్శలకు మరింత పదును పెట్టింది.
Chhattisgarh CM played ‘Candy Crush’ during Congress meeting
Chhattisgarh CM played ‘Candy Crush’: 5 రాష్ట్రాల్లో ఎన్నిక నగారా మోగింది. ఒక్క ఛత్తీస్ గఢ్లో (Chhattisgarh) మాత్రమే రెండు విడతల పోలింగ్ జరగనుంది. ఇక్కడ మావోయిస్టుల ప్రభావం ఉండటంతో భద్రతా ఏర్పాట్లను చూసుకొని రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. మిగతా 4 చోట్ల ఓకే విడత పోలింగ్ నిర్వహిస్తారు. ఛత్తీస్ గఢ్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడే కాంగ్రెస్- బీజేపీ మధ్య విమర్శలు పెరిగాయి.
అభ్యర్థుల ఎంపిక
షెడ్యూల్ రాగానే అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టిసారించాయి. క్యాండెట్స్ను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. సీఎం భూపేశ్ భాగల్, ఇతర సీనియర్ నేతలు అంతా హాజరయ్యారు. నియోజకవర్గాలు పరిస్థితులు, సామాజిక సమీకరణాలపై చర్చ జరుగుతుంది. కీలక అంశాలపై సీరియస్గా చర్చ జరుగుతున్న సమయంలో సీఎం భూపేశ్ (Chhattisgarh CM bhupesh) మాత్రం ఫోన్లో లీనం అయ్యారు. ఏదో ఇన్ఫో, అప్ డేట్స్ చూసుకుంటే ఫర్లేదు.. ఆయన క్యాండీ క్రష్ ఆడుతున్నారు. ఆ ఫోటో బయటకు వచ్చింది. ఇదే విషయాన్ని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవియా టార్గెట్ చేశారు.
ప్రభుత్వం ఏర్పడదు
‘ఎంత పోరాడినా రాష్ట్రంలో తిరిగి ప్రభుత్వం ఏర్పడదు. ఆ విషయం తెలుసు.. అందుకే హాయిగా.. కూర్చొన్నారు. అందుకే మొబైల్ ఓపెన్ చేసి గేమ్ ఆడుతున్నారు’ అని మాలవియా విమర్శించారు. అందుకే అభ్యర్థుల ఎంపిక గురించి పట్టించుకోవడం లేదెమో అని సెటైర్లు వేశారు. ఛత్తీస్ గఢ్లో తిరిగి తమ ప్రభుత్వం ఏర్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో అధికారం సాధ్యం అనుకుంటోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీజేపీ అంటోంది. భూపేశ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శిస్తోంది.
రేపు ఖరారు
ఛత్తీస్ గఢ్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం 12వ తేదీ గురువారం రోజున సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అవుతుందని రాష్ట్ర ఇంఛార్జీ కుమారీ షెల్టా తెలిపారు. ఆ రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ మాత్రం ఇప్పటికే రెండు విడతల్లో 85 మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. మరో ఐదు సీట్లలో టికెట్ కేటాయించాల్సి ఉంది.