భారతదేశానికి చెందిన 71.1 లక్షల వాట్సాప్ ఖాతాలను సెప్టెంబర్ నెలలలో బ్యాన్ చేశామని కంపెనీ పేర్కొంది. 50 లక్షల యూజర్లు ఉన్న సోషల్ మీడియా నెలవారీ రిపోర్ట్ వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వం కోరగా.. ఈ మేరకు రిపోర్ట్ వెల్లడించింది.
నిన్న మొన్నటి వరకు కేరళను జికా వైరస్ వణికించింది. తర్వాత ఇప్పుడు కర్ణాటకలో దోమలలో జికా వైరస్ కనుగొన్నారు. దాని వ్యాప్తి గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రశ్నలకు బదులుగా డబ్బు తీసుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణల వ్యవహారంలో గురువారం (నవంబర్ 2) ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి చేరుకోలేదు. సమన్లను పట్టించుకోకుండా మధ్యప్రదేశ్‌కు వెళ్లిపోయారు.
సౌదీఅరేబియాలో ఉన్న ఓ వ్యక్తి తన భార్యతో మాట్లాడేందుకు వీడియో కాల్ చేశాడు. కాల్ మాట్లాడుతుండగా…అతని చూపు భార్య కనుబొమ్మలపై పడింది.భార్య ఐబ్రోస్ చేయించుకుందని భార్త విడకులు ఇచ్చాడు
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ పుట్టిన రోజు సందర్భంగా బోధన, అభ్యాసంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కొత్తగా 'నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్‌ను ప్రారంభించారు.
విమానం నడిపే పైలట్లు, క్రూ సిబ్బంది మౌత్‌వాష్‌లు, టూత్ జెల్ లేదా ఆల్క్‌హాల్ శాతం అధికంగా ఉండే ఉత్పత్తులను వినియోగించొద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలు వెలువరించింది.
విజయనగరంలో రైలు ప్రమాద ఘటన జరిగి వారం రోజులు కూడా కాకుండానే యూపీలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సుహైల్ దేవ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక ప్రకటన చేసింది. నవంబర్ 30వ తేది వరకూ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించింది. అలాగే రాజకీయాలతో సంబంధం లేని వారి డబ్బులు సీజ్ చేసి ఉంటే వెంటనే వాటిని తిరిగి ఇచ్చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
నామినేషన్ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో తాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. సచిన్ పైలట్ టోంక్ అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేస్తున్నప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్‌లో, అతను తన భార్య పేరు ముందు విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు.
భారతీయుల డేటా హ్యాక్ అయ్యింది. అది కూడా 80 కోట్ల మందికి పైగా డేటా లీక్ కావడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఐసీఎంఆర్ నుంచి ఈ డేటా లీక్ అవ్వడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. దేశంలోనే ఇప్పటి వరకూ జరిగిన డేటా లీక్ ఘటనల్లో ఇదే అతి పెద్దది కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టాయి.
మరాఠా రిజర్వేషన్ల కోసం చేపడుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. హింసాత్మక ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆంక్షలు విధించడమే కాకుండా ఇంటర్నెట్, రవాణా సేవలను నిలిపివేశారు.
విపక్షనేతల ఐఫోన్లకు హ్యాకింగ్ అలెర్ట్ రావడంతో కేంద్ర ప్రభుత్వమే తమ మైబైల్స్‌ను హ్యక్ చేశారని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. అంతేకాదు యాపిల్ యాజమన్యం సైతం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
మరికొన్ని రోజుల్లో మీరు థాయిలాండ్(thailand) టూర్ వెళ్లనున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మరికొన్ని రోజులు వీసా లేకుండానే థాయిలాండ్లో పర్యటించవచ్చని ఆ దేశ అధికారులు ప్రకటించారు. అంతేకాదు 30 రోజుల పాటు అక్కడ ఉండే అనుమతి కూాడా ఉందన్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, స్టాలిన్‌ల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.