చత్తీస్‌గఢ్ అసెంబ్లీ జరుగుతున్న మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలింగ్ ప్రారంభమైన గంటలోనే సుక్మా జిల్లా తొండమర్కలో జరిగిన ఈఐడీ పేలుడులో సీఆర్‌పీఎఫ్ జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
సీఎం స్టాలిన్ సర్కార్‌పై అన్నాడీఎంకే సీనియర్ నేత వినూత్నంగా ఒంటెద్దు బండిపై ప్రయాణించి నిరసన తెలిపారు. అయితే దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగ జీవాలను ఇలా చేయడం ఏంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
వారం రోజుల క్రితం కేరళ క్రైస్తవ మత సమ్మేళనంలో జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. 61 ఏళ్ల మహిళ సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుకు చనిపోయింది.
భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ నగరాల్లో, వాయు కాలుష్యం కారణంగా ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఢిల్లీలోని ఏక్యూఐ సోమవారం వరుసగా ఐదో రోజు 'తీవ్ర' కేటగిరీలో నమోదైంది. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. నేడు రాజధానిలో AQI 488గా ఉంది, ఇది చాలా హానికరం.
మహాదేవ్ బుక్, రెడ్డిఅన్నాప్రిస్టోప్రో సహా 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లపై కేంద్ర ప్రభుత్వం ఆదివారం బ్లాక్ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణ, రైడ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది.
గత కొన్ని రోజులుగా కన్నూర్ ఆసుపత్రిలోని మార్చురీ బయట కుక్క వేచి ఉంటోంది. ఇప్పటికి ఆ కుక్క ఎదురు చూపులకు నాలుగు నెలలు గడిచిపోయాయి. యజమాని చనిపోయాడని తెలియపోవడంతో అది అలా వెయిట్ చేస్తూనే ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితిని దృష్ట్యాలో ఉంచుకుని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం తెలిపారు.
రైతుల పొలాల మంటలను నివారించాలని వెళ్లిన ఓ అధికారికి వింత అనుభవం ఎదురైంది. ఆ క్రమంలో ఓ ప్రాంతానికి వెళ్లిన అధికారిని ఆపిన రైతులు..అతనిచే వరి కుప్పను తగులబెట్టించారు. ఈ సంఘటనను ఓ రైతు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అక్కడి సీఎం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీర ప్రాంత రక్షణకు అగ్ర దేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది.మిసైల్ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ సూరత్ సిద్ధమైంది.
ఇస్రో చైర్మన్ సోమనాథ్ బయోగ్రఫీ వివాదంలో చిక్కుకుంది. ఈ బయోగ్రఫీలో ఇస్రో మాజీ చైర్మన్ శివన్‌ను టార్గెట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆటోబయోగ్రఫీ నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కలు ఈ నెల 19న ప్రయాణించొద్దని ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ బెదిరించారు. నవంబర్ ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుందని. మీ ప్రాణాలకు ప్రమాదం' అని వీడియోలో హెచ్చరించారు
మధ్యప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ టీచర్ వింతగా ప్రవర్తించాడు. ఎన్నికల ట్రైనింగ్‌కు హాజరుకాలేదు. ఎందుకు రాలేదని అడిగితే.. తనకు పెళ్లి చేయాలని సమాధానం ఇచ్చాడు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. నిన్నటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఆయనకు వైరల్ ఫీవర్ అని తేలింది.