»Delhi Air Pollution Atishi Said Delhi Primary Schools Remain Closed Till November 10
Delhi: విషపూరితమైన గాలి.. నవంబర్ 10వరకు విద్యాసంస్థలకు హాలిడేస్
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితిని దృష్ట్యాలో ఉంచుకుని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం తెలిపారు.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితిని దృష్ట్యాలో ఉంచుకుని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం తెలిపారు. ఈ సమయంలో పాఠశాలలు 6 నుండి 12 తరగతులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించుకునేందుకు అనిమతినిచ్చింది. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. ఢిల్లీలో వాయుకాలుష్యం అత్యధిక స్థాయికి చేరుకుందని అన్నారు. ముఖ్యంగా ఇది పిల్లలకు చాలా హానికరంగా పేర్కొన్నారు. వాయు కాలుష్యం దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 2023 నవంబర్ 10వరకు ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది.
प्रदूषण का स्तर लगातार ऊंचा बना हुआ है, इसलिए दिल्ली में प्राथमिक स्कूल 10 नवंबर तक बंद रहेंगे। ग्रेड 6-12 के लिए स्कूलों को ऑनलाइन कक्षाओं में शिफ्ट होने का विकल्प दिया गया है: दिल्ली की शिक्षा मंत्री आतिशी pic.twitter.com/WdUaQqL3wd
ఆదివారం కూడా ఢిల్లీలో కాలుష్యం నుండి ప్రజలు ఉపశమనం పొందే అవకాశం లేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. ఢిల్లీలోని షాదీపూర్ ప్రాంతంలో ప్రజలు గరిష్ట కాలుష్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఢిల్లీలో గాలి నాణ్యత గత మూడు రోజులుగా తీవ్ర స్థాయిలోనే ఉంది. ఢిల్లీలోని ఆర్కే పురంలో ఏక్యూఐ 489, ద్వారక సెక్టార్ 8లో 486, ఓఖ్లా ఫేజ్ టూలో 484, పట్పర్గంజ్లో 464, ఐజీఐ ఎయిర్పోర్ట్ (టీ3 చుట్టూ 480), బవానాలో 479, ముండ్కాలో 474, నజాఫ్‌గఢ్‌లో 472గా నమోదైంది.