»Do Not Travel In Air India On 19 Gurupatwant Singhs Warning
Gurupatwant Singh : 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించొద్దు.. గురుపత్వంత్ సింగ్ హెచ్చరిక
ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కలు ఈ నెల 19న ప్రయాణించొద్దని ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ బెదిరించారు. నవంబర్ ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుందని. మీ ప్రాణాలకు ప్రమాదం' అని వీడియోలో హెచ్చరించారు
నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ (Gurupatwant Singh) హెచ్చరించారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగే నవంబర్ 19న ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయాన్ని(IGI Airport) మూసివేస్తామన్నాడు. ఆ రోజు ఎయిర్ ఇండియా (Air India) ద్వారా ప్రయాణించడానికి ప్లాన్ చేసుకుంటున్న వ్యక్తుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే అని బెదిరించాడు. “నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను ప్రత్యేకంగా కోరుతున్నాం. గ్లోబల్ దిగ్బంధనం ఉంటుంది” అని పన్నూన్ హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ(Delhi)లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయం మూసివేస్తామని, దాని పేరు మారుస్తామని కామెంట్లు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
క్రికెట్ ప్రపంచ కప్ (World Cup) లో ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు అదే రోజని పరోక్షంగా మరో హెచ్చరిక చేశాడు. అక్టోబర్ 31, 1984న న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్‌లు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణతో పంజాబ్ (Punjab) స్వాతంత్య్ర పోరాటం ఇప్పటికే ప్రారంభమైందని గురుపత్వంత్ సింగ్ పన్నూ చెప్పాడు. భారత ట్యాంకులు, ఫిరంగిదళాలు దాని సాకారాన్ని నిరోధించలేవని ఆయన స్పష్టం చేశారు. కాగా.. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) వ్యాఖ్యల తర్వాత భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోడీకి పన్నూ హెచ్చరికలు పంపుతున్నాడు. ప్రస్తుతం కెనడా(Canada), భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో పన్నూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్ఎఫ్జే నుంచి భారత్‌కు తీవ్ర పరిణామాలు వుంటాయని ఆయన పలుమార్లు హెచ్చరించారు.
New York and Canada based terrorist asks Sikhs to not fly Air India after Nov 19, as their lives can be under threat. He says they will not let Air India fly