»Example Of Loyalty Owner Dies In Hospital Dog Waiting Outside Mortuary For 4 Months
Kerala: చనిపోయిన యజమాని నాలుగు నెలలుగా ఆస్పత్రి మార్చురీ ఎదుటే నిరీక్షిస్తున్న కుక్క
గత కొన్ని రోజులుగా కన్నూర్ ఆసుపత్రిలోని మార్చురీ బయట కుక్క వేచి ఉంటోంది. ఇప్పటికి ఆ కుక్క ఎదురు చూపులకు నాలుగు నెలలు గడిచిపోయాయి. యజమాని చనిపోయాడని తెలియపోవడంతో అది అలా వెయిట్ చేస్తూనే ఉంది.
Kerala: కుక్కల విధేయత గురించి వేలాది కథలు విన్నాం. హచికో అనే జపనీస్ కుక్క తన యజమాని కోసం 9 సంవత్సరాలు వేచి ఉంది. దాని జీవితం అలా వెయిటింగ్ చేస్తూనే ముగిసిపోయింది. తర్వాత ఆ కుక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కేరళలోని కోజికోడ్‌లో ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా కన్నూర్ ఆసుపత్రిలోని మార్చురీ బయట కుక్క వేచి ఉంటోంది. ఇప్పటికి ఆ కుక్క ఎదురు చూపులకు నాలుగు నెలలు గడిచిపోయాయి. యజమాని చనిపోయాడని తెలియపోవడంతో అది అలా వెయిట్ చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే కుక్క యజమాని ఎవరో తమకు తెలియదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే, దాని యజమాని ఆసుపత్రిలో మరణించిన రోగి అయి ఉండవచ్చని ఊహిస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లడం కుక్క చూసి ఉండాలి. ఆసుపత్రి అటెండెంట్ రాజేష్ కుమార్ మొదట కుక్కపై దృష్టి పెట్టారు. నాలుగు నెలలుగా మార్చురీ బయట ర్యాంపుపై పడుకుని ఉండడం ఆస్పత్రి సిబ్బంది గమనిస్తూనే ఉన్నారు.
ఆసుపత్రి అటెండెంట్ రాజేష్ మాట్లాడుతూ, మొదట మేము కుక్కను పట్టించుకోలేదు. కానీ రోజూ అక్కడే ఉండడం చూసి నేను దానిని గమనించడం మొదలుపెట్టాను. చుట్టుపక్కల వారిని ప్రశ్నించగా.. ఓ పేషెంట్‌తో ఆస్పత్రికి వచ్చినట్లు తేలింది. ఆ తర్వాత ఆసుపత్రిలోనే రోగి మృతి చెందాడు. అయితే కుక్క ఎవరితో వచ్చిందో తెలియడం లేదని ప్రజలు అంటున్నారు. తొలినాళ్లలో కుక్క ఏమీ తినలేదు. అయితే తర్వాత బిస్కెట్లు తినడం మొదలుపెట్టాడు. మృతదేహాలను తీసుకెళ్లే ర్యాంప్లోనే కుక్క నివసిస్తుందని రాజేష్ తెలిపారు. ఇది మార్చురీ గేటు దగ్గరే ఉంటోంది. మృతదేహాలను బయటకు తీసినప్పుడల్లా అది గేటు ద్వారా లోపలికి వస్తుంది. ఎప్పటికైనా తన యజమాని తిరిగి వస్తాడని అక్కడే కూర్చొంటుంది. కుక్క అప్పుడప్పుడు ఫిజియోథెరపీ బిల్డింగ్ దగ్గరికి వెళ్లి తిరిగి అక్కడికే వస్తుందని చెప్పారు. యజమానిపై బెంగతో ఇతర కుక్కలతో కూడా కలవడం లేదని రాజేష్ తెలిపారు.
కుక్కకు చేపలు, గుడ్లు అంటే ఇష్టమని డాక్టర్ సిబ్బంది మాయా గోపాలకృష్ణన్ తెలిపారు. ఇది కాకుండా అన్నం తింటుందని చెప్పాడు. కుక్క యజమాని దానికి ఏమి తినిపించాడో కూడా మాకు తెలియదు. గోపాలకృష్ణన్ కుక్కకు రాముడు అని పేరు పెట్టాడు. ఓ మహిళ కూడా కుక్కను దత్తత తీసుకోవాలని కోరినట్లు వైద్యులు తెలిపారు.