INS Surat : సరికొత్త యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ సిద్ధం
తీర ప్రాంత రక్షణకు అగ్ర దేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది.మిసైల్ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ సిద్ధమైంది.
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో రూ. 35,800 కోట్లతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌకలు (Warships) తయారు చేయాటానికి భారత నౌకాదళం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన వైజాగ్, మర్ముగామ్, ఇంఫాల్, సూరత్ (Surat)పేర్లని పెట్టాలని . తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. ఇప్పటికే ఐఎన్ఎస్ విశాఖపట్నం(INS Visakha), ఐఎన్ఎస్ మర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరాయి.తాజాగా చివరి నౌకగా ఐఎన్ఎస్ సూరత్ వార్ షిప్ కూడా విధుల్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ షిప్‌కు సంబంధించి 2018 జూలైలో కీల్ నిర్మించగా.. 2022 మే 17న షిప్ తయారీ పనుల్ని బ్లాక్ కనస్ట్రక్షన్ మెథడాలజీ సాంకేతికతతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్(ఎండీఎల్) ప్రారంభించింది. ఈ నౌకకు తొలుత గుజరాత్లో ప్రధాన ఓడరేవు అయిన పోర్బందర్ పేరు పెట్టాలని నౌకాదళం భావించింది. తర్వాత.. రక్షణ మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఐఎన్ఎస్ సూరత్‌గా (INS Surat) నామకరణం చేశారు.
ఈ 4 షిప్స్‌ని 2024 కల్లా నౌకాదళానికి అప్పగించాలని ఒప్పందం. కాగా, తుదిదశకు ఐఎన్ఎస్ సూరత్ పనులు చేరుకున్న తరుణంలో ముఖ్యమైన క్రెస్ట్ (యుద్ధనౌకకు సంబంధించి ప్రత్యేకమైన సంప్రదాయ చిహ్నం. క్రెస్ట్ పూర్తయితే నౌక జాతికి అంకితం చేసేందుకు సిద్ధమైనట్లే.) ఆవిష్కరణ సూరత్‌లో జరగనుంది. అనంతరం తుది దశ ట్రయల్స్ నిర్వహించి నౌకాదళానికి అప్పగించనున్నారు. విశాఖపట్నం–క్లాస్ స్టెల్త్ గైడెడ్–మిసైల్ డిస్ట్రాయర్ యర్ నౌకల్లో ఆఖరిది ఐఎన్ఎస్ సూరత్. విశాఖపట్నం క్లాస్ యుద్ధ నౌకలన్నీ బ్రహ్మోస్ క్షిపణుల్ని (BrahMos missiles) మోసుకెళ్లగల సామర్థ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోదగ్గ ఐఎన్ఎస్ సూరత్‌ను అత్యాధునిక ఆయుధ సెన్సార్లు, అధునాతన ఫీచర్లు, పూర్తిస్థాయి ఆటోమేషన్తో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ యుద్ధనౌక భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.