NLG: గ్రామాల్లో విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ఆ శాఖ అధికారులు ప్రజా బాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చిట్యాల మండలం ఆరెగూడెంను గురువారం సందర్శించి ప్రజలు, రైతుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తు అధికారులు బాలస్వామి, వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి ఉన్నారు.