»Dum Masala First Single Promo Release From Guntur Karam Movie
Guntur Karam: నుంచి దమ్ మసాలా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో సాంగ్ విడుదలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ అదిరిందని అంటున్నారు. అయితే ఈ ప్రోమో వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓసారి లుక్కేయండి మరి.
Dum Masala first single promo release from Guntur Karam movie
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) యాక్ట్ చేసిన గుంటూరు కారం(Guntur Karam) మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. “దమ్ మసాలా” పేరుతో ఫస్ట్ పాట ప్రోమోను విడుదల మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట విన్న అభిమానులు, సినీ ప్రేమికులు అదిరిపోయిందని అంటున్నారు. ఈ ప్రోమో వీడియోలో మహేష్ కూర్చిలో దర్జాగా కూర్చుని సిగరేట్ తాగుతున్నట్లుగా మాస్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ పాట ఫుల్ సాంగ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజున నవంబర్ 7 విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా..ఈ పాటకు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి అందించారు. సంజిత్ హెడ్గే ఘాటుగా ఈ పాటను ఆలపించారు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
దీపావళి పండుగ వేడుకల నేపథ్యంలో చిత్రనిర్మాతలు ఈ మూవీలోని కీలకమైన సీన్లను షూట్ చేయించనున్నారు. ఆ తర్వాత కీలకమైన యాక్షన్ సీక్వెన్స్, విదేశీ లొకేల్లో పలు సాంగ్స్ చిత్రీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత షెడ్యూల్ అనుకున్నట్లుగా జరిగితే, నవంబర్ చివరి నాటికి సినిమా మొత్తం షూటింగ్ దశను పూర్తి చేసుకోనుంది. 2024లో సంక్రాంతి(sankranti 2024) సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. ఆ క్రమంలో డిసెంబర్, జనవరి మొదటి వారాల్లో మహేష్ బాబు, త్రివిక్రమ్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.