AP: తెలంగాణ చేపట్టిన కల్వకుర్తి, SLBC, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల విస్తరణకు పర్యావరణ అనుమతులు లేవని జగన్ అన్నారు. ఆ పనులు ఆపాలని 2021లో తమ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. ఇప్పుడు శ్రీశైలం, సాగర్, పులిచింతల పవర్ హౌస్‌లను తెలంగాణ ఆపరేట్ చేస్తున్నా.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడంతో రేవంత్‌పై బాబు మాట్లాడట్లేదని విమర్శించారు.