NLG: పట్టణ రాజకీయ పక్షాల నాయకుల్లో హడావిడి మొదలైంది. ఈనెల 16న పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాను ఫైనల్ చేయనున్నారు. మున్సిపల్ ఛైర్మన్, వార్డుల్లో గత రిజర్వేషన్లు ఉంటాయా రొటేషన్ పద్ధతిలో మార్పు జరుగుతుందా అనే విషయంలో ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్లు మారితే చిట్యాల మున్సిపాలిటీ బీసీ జనరల్ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.