MDCL: ఓల్డ్ ఆల్వాల్ పరిధి జొన్నబండ ఎంహెచ్ఆర్ కాలనీలో 1444.40 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఆక్రమణ ప్రయత్నాలపై ప్రజావాణిలో ఫిర్యాదు రావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి పార్కు స్థలంగా నిర్ధారించింది. నిన్న పార్కు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ప్రజలకు ప్రాణవాయువును అందించే పార్కును రక్షించిన హైడ్రాకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.