HNK: గంజాయి కేసు నిందితులకు ఎస్కార్ట్గా ఉన్న పోలీసుల నిర్లక్ష్యంతో ముగ్గురు పరారయ్యారు. DEC 8న చెన్నైకి చెందిన నలుగురిని డ్రగ్ కంట్రోల్ టీం పట్టుకుని HNK స్టేషన్కు తరలించింది. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు మధుసూదన్, నగేష్, హెడ్ కానిస్టేబుల్ బుచ్చయ్య, రాజు నిద్రపోవడంతో నిందితులు పరారయ్యారు. ఈ ఘటనపై CP నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.