యమునోత్రి జాతీయ రహదారిలో నిర్మిస్తున్న సొరంగంలో కొంత భాగం ఒక్కసారిగా కూలింది. ఆ సొరంగం శిథిలాల కింద 40 మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది.
అయోధ్యలో దీపోత్సవం వేడుకగా సాగింది. ఈ దీపోత్సవంలో 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు సాధించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు గిన్నిస్ ప్రతినిధులు సర్టిఫికెట్‌ను అందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ( liquor policy case) అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా (Manish Sisodia) జైలు నుంచి బయటకు వచ్చారు.
దీపావళి పండగ కోసం స్వస్థలాలకు వెళ్లేందుకు సూరత్ రైల్వేస్టేషన్‌లో జనం బారులుతీరారు. ఓకే సమయంలో జనం ఎక్కువ మంది రావడంతో తొక్కిసలాట జరిగింది. దాంతో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు.
ఓ రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగకుండా బయట ఆగింది. దీంతో రైలు దిగడానికి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఏసీ కోచ్ నుంచి దిగే ఓ వృద్ధుడికి గాయం అయ్యింది. దీంతో ఆయన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన ఆ కమిషన్ రైల్వేకు రూ.30 వేల జరిమానాను విధించింది.
హర్యానాలో దారుణం జరిగింది. కల్తీ మద్యం తాగి 19 మంది మృతిచెందారు. యమునానగర్, అంబాలా జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఈ మరణాలు నమోదు అయ్యాయి.
రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. బిస్కెట్ ఇస్తానని ఆశ చూపి.. ఓ నాలుగేళ్ల చిన్నారిపై ఎస్ఐ లైంగికదాడికి తెగబడ్డాడు.
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో ఉన్న దాల్ సరస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సంగీత ప్రపంచంలో ముఖ్యమైన గ్రామీ అవార్డుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాసిన ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాట ఎంపికైంది. ఈ పాట బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో నామినేట్ చేయబడింది. బజ్రీ వంటి పోషకమైన ధాన్యాలను ప్రోత్సహించడానికి అతను ఈ పాటను వ్రాసాడు.
నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. MRPS లేవనెత్తుతున్న డిమాండ్లపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మోడీ రాక నేపథ్యంలో ఈ సభకు కీలక బీజేపీ నేతలు హాజరుకానున్నారు.
కర్ణాటక బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నియమితులయ్యారు.
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి (Fisherman) అదృష్టం ఎదురొచ్చింది. దీంతో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు.
భార్యాభర్తల బంధానికి మచ్చ తెచ్చే ఉదంతం యూపీలోని అమ్రోహాలో వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి తన భార్యను ఏం చేసాడో వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఒక వ్యక్తి జూదంలో తన భార్యను పణంగా పెట్టాడు.
అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలిసేందుకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను రోస్ అవెన్యూ కోర్టు శుక్రవారం అనుమతించింది.
భారత్ జోడో యాత్రకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ చెల్లాచెదురైంది. చాలా మంది నాయకులు ఆ పార్టీని వీడి BRS, BJP లో చేరారు. బీఆర్‌ఎస్, బీజేపీ తర్వాత కాంగ్రెస్ మూడో స్థానంలో ఉందని కాంగ్రెస్ అంతర్గత సర్వేలో తేలింది.