తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరగనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు సాధారణంగా అనేక రకాల వాగ్దానాలు చేస్తాయి.
కుక్కకాటు ఘటనల పెరుగుదలపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీధుల్లో వీధికుక్కల బెడద బాగా పెరిగిపోయిందని కోర్టు పేర్కొంది.
కర్ణాటకలో గత నెల 28వ తేదీన వివిధ కార్పొరేషన్ బోర్డుల్లో నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 18, 19 తేదీల్లో జరగనున్న డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు వచ్చే అభ్యర్థుల విషయంలో కఠిన నిబంధనలు జారీ చేశారు. ఈ ఎగ్జామ్ కోసం వచ్చే వారు బట్టల విషయంలో కూడా నిబంధనలు ప్రకటించారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
నేడు బాలల దినోత్సవం(happy children's day). ఈ సందర్భంగా పిల్లల భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం ప్రణాళిక వేయడం అనేక మందికి ఒక సవాలుతో కూడుకున్న పని. ఈ క్రమంలోనే ప్రస్తుతం మార్కెట్లో కొన్ని పిల్లల పెట్టుబడి కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు చుద్దాం.
అతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ మంగళవారం ఉదయం మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 94. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది.
ఈశాన్య రుతుపవనాల చురుకుగా మారినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.కేరళలోని కొన్ని జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఓ పని వార్తల్లో నిలిచింది. కొరడాతో కొట్టుకుని భూపేష్ బఘేల్ ఛత్తీస్‌గఢ్ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఈ కొరడా దెబ్బలు ఎందుకు కొట్టుకున్నారో ఆయన స్పష్టం చేశారు.
ఆదిత్య ఎల్1 తర్వాత గగన్‌యాన్‌పై ఇస్రో దృష్టి పెట్టింది. కానీ మరో ఐదేళ్లలో శుక్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్ర గ్రహంపైకి శుక్రయాన్ ప్రాజెక్ట్, అంగారక గ్రహంపై పరిశోధనలు చేపట్టేందుకు మరో ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది.
దీపావళి(నవంబర్ 12న) రోజున ఉత్తరకాశీలో పెద్ద ప్రమాదం జరిగింది. సిల్క్యారా నుంచి దండల్‌గావ్ వరకు నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో సొరంగంలో పనిచేస్తున్న 40 మంది కార్మికులు లోపలే ఉండిపోయారు. 24 గంటలకు పైగా గడిచినా కూలీలను తరలించలేకపోయారు. అయితే వారిని తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
అనంత పద్మనాభస్వామి ఆలయంలో మరో మొసలి ప్రత్యక్షమైంది. గత ఏడాది బబియా అనే మొసలి చనిపోయిన సంగతి తెలిసిందే. అది చనిపోయిన సరిగ్గా ఏడాదికి మరో మొసలి ప్రత్యక్షం అవ్వడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీకి చెందిన ఆరెంజ్ వుడ్ సంస్థ తమ కంపెనీలో రోబోలతో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. అలాగే రోబోలతోనే లక్ష్మీపూజను చేయించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జియో ఎయిర్ ఫైబర్ ఇప్పుడు మరికొన్ని ప్రాంతాలకు విస్తరించింది. మొదట 8 నగరాల్లో మొదలైన ఈ సేవలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 115 నగరాలకు వ్యాపించింది. అయితే దీనిలో ఎలాంటి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు, సౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంతలో, బెతుల్ నుండి ఒక ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది.
అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్‌కు చేరింది. మరో రెండు నగరాలు వాయుకాలుష్యంలో చిక్కుకున్నాయి.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఘోరం జరిగింది. దీపావళికి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు ధాబా వర్కర్లు తమ యజమానిని కిరాతకంగా చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.