రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రచారంలో పాల్గొన్నారు. దేశాన్ని గ్లోబల్ సూపర్ పవర్‌గా మార్చే కలను బీజేపీ ప్రభుత్వం సాకాారం చేస్తుందని పేర్కొన్నారు. రైతులు సురక్షితంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వమే మళ్లీ రావాలని అభిప్రాయంవ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు రేపు ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6:00 గంటల వరకు కొనసాగుతుంది.
స్కూల్‌లో టీచర్లు గొడవ పడ్డారు. వారిని మిగతా టీచర్లు, సిబ్బంది ఆపారు. ఆ క్రమంలో ఏడుగురు గాయపడ్డారు.
పిల్లలతో ప్రధాని మోడీకి ఉన్న అనుబంధాన్ని ఎవరు దాచలేరు. అతను తరచుగా పబ్లిక్ ఈవెంట్లలో పిల్లలతో సరదాగా గడపడం మనం చూడవచ్చు. అలాంటి వీడియోనే తాజాగా మోడీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
పాఠశాలల్లోని విద్య, నాణ్యతా ప్రమాణాలపై నీతి ఆయోగ్ షాకింగ్ నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగానే ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుంటే విద్యలో నాణ్యత చూపే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అత్యధిక శాతం పట్టణాల్లోనే టీచర్లు ఉంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉండటం వల్ల విద్యలో లోపం కనిపిస్తోందని తేల్చింది. విద్యలో నాణ్యత తీసుకురావాలంటే కచ్చితంగా పెద్ద ఎత్తున ఖాళీ...
ఉత్తరకాశీలో జరిగిన టన్నెల్ ప్రమాదం జరిగి 80గంటలు గడిచింది. టన్నెల్ ప్రమాద స్థలంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ లేట్ అవుతుందని సహచర కార్మికులు ఆందోళనకు దిగారు.
సెల్ఫీ ఇవ్వాలని కోరితే ఓ యువకుడి చెంపచెల్లు మనిపించాడు బాలీవుడ్ నటుడు నానా పటేకర్. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్ వినియోగించిన కారణంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై కేసు నమోదైంది
జార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలోని గిరిజనుల ఐకాన్ బిర్సా ముండా జన్మస్థలం ఉలిహతును ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సందర్శించారు. ఆయన జయంతిని జనజాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకునే సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీంతోపాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులను సైతం ప్రారంభించారు.
జమ్ముకశ్మీర్ దోడాలో ఓ బస్సు అదుపు తప్పి దాదాపు 300 అడుగుల లోతున్న గుంతలో ఆకస్మాత్తుగా పడిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో 38 మంది మృత్యువాత చెందగా..మరికొందరికి గాయాలయ్యాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేవారికి పిల్లలను ఇవ్వాలంటే తల్లిదండ్రులు నచ్చడం లేదు. దీంతో కర్ణాటకలోని గ్రామీణ యువ రైతులు పాదయాత్రగా పుణ్యక్షేత్రానికి వేళ్లేందుకు సిద్దమయ్యారు
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు అందించింది. ప్రధాని మోదీపై ముంబయి సభలో తీవ్ర ఆరోపణలు చేసిందని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని, నవంబర్ 16వ తేది లోపు నోటిసులకు రిప్లై ఇవ్వకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా మాదిరిగా ఒకరు ఉన్నారు. ఆ ఫోటోను పుణెకు చెందిన ఒకరు షేర్ చేశారు. దానికి ఆనంద్ మహీంద్రా రియాక్ట్ అయ్యారు.
రోడ్డు ప్రమాదంలో కుడి కాలు కోల్పోయిన వ్యక్తికి రూ.2 కోట్ల పరిహారం అందనుంది. ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2016లో జరిగిన ఈ ప్రమాదంపై మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) తీర్పు ఇచ్చింది.
ఢిల్లీలోని యమునా పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. ఏళ్ల తరబడి యమునానదిలో అపరిశుభ్రత నెలకొని ఉంది.