కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి(Kumaraswamy)పై కేసు నమోదైంది. దీపావళి సందర్బంగా తన ఇంటికి అలంకరించే క్రమంలో ఓ స్తంభం నుంచి అక్రమంగా తీగలను వేసినట్లు బెస్కాం విద్యుత్తు సరఫరా సంస్థ (Electricity supply company) అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ఏఈఈ ప్రశాంత్‌కుమార్ ఇచ్చిక కంప్లైంట్ నేఫద్యంలో కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై కుమారస్వామి స్పందిస్తూ తన నివాసాన్ని అలంకరించే బాధ్యతను ఓ ప్రైవేటు డెకొరేటర్(Decorator)కు అప్పగించగా, కేవలం టెస్టింగ్ కోసమే బయట నుంచి కరెంట్ (Current) తీసుకున్నారని చెప్పారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని వివరించారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయం గుర్తించి ఇంట్లో మీటర్ నుంచి విద్యుత్తు వాడుకోవాలని సూచించినట్లు కుమారస్వామి తెలిపారు. ఇది అక్రమమని భావిస్తే అధికారులు తనకు నోటీసులు ఇచ్చి విచారణ చేపడితే జరిమానా కట్టేందుకు సిద్ధమని వివరణ ఇచ్చారు. దేశం, రాష్ట్రం మునిగిపోయేంత పని తానేమీ చేయలేదన్నారు. తెలంగాణ(Telangana)లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ పథకాల గురించి అప్రమత్తంగా ఉండాలని కుమారస్వామి ప్రకటించిన మరుసటి రోజే కేసు నమోదు కావడం గమనార్హం.