»Man Who Lost Leg In A Accident Will Get Two Crore As Compensation
Court Order: ఏడేళ్ల క్రితం యాక్సిడెంట్.. రూ.2కోట్లు ఇవ్వాలని బీమా కంపెనీకి కోర్టు ఆదేశాలు
రోడ్డు ప్రమాదంలో కుడి కాలు కోల్పోయిన వ్యక్తికి రూ.2 కోట్ల పరిహారం అందనుంది. ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2016లో జరిగిన ఈ ప్రమాదంపై మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) తీర్పు ఇచ్చింది.
Court Order: రోడ్డు ప్రమాదంలో కుడి కాలు కోల్పోయిన వ్యక్తికి రూ.2 కోట్ల పరిహారం అందనుంది. ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2016లో జరిగిన ఈ ప్రమాదంపై మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) తీర్పు ఇచ్చింది. నిర్ణీత గడువులోగా పరిహారం ఇవ్వకుంటే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ముంబైలోని భాండూప్‌లో నివసిస్తున్న ఈ 53 ఏళ్ల వ్యక్తి ఎఫ్ఎంసిజి కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM)గా పని చేస్తున్నారు. అతని పోస్టింగ్ మధ్యప్రదేశ్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుంచి దతియాకు స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్నాడు. టాయిలెట్‌కు వెళ్లేందుకు జాతీయ రహదారిపై దాబా దగ్గర కారు ఆపి మూత్ర విసర్జనకు దిగాడు. ఇంతలో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ వారిని ఢీకొట్టింది. ఆ తర్వాత అతని కాలు తీసేయాల్సి వచ్చింది.
ఈ ప్రమాదం కారణంగా అప్పీలుదారుకు ఆదాయానికి నష్టం వాటిల్లిందన్న మాట వాస్తవమేనని ధర్మాసనం తీర్పు ఇస్తూ పేర్కొంది. ఆ కంపెనీ అతడిని తొలగించకపోవడం ఆయన అదృష్టం. కాకపోతే ఈ ప్రమాదం కారణంగా అతని సంపాదన సామర్థ్యం దెబ్బతింది. అతడి ఉద్యోగ స్వభావం, తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తుంచుకోవాలని కోర్టు సూచించింది. కాలు తెగిపోవడంతో ఇక అంత కష్టపడలేకపోతున్నాడు. బాధిత కుటుంబానికి వారి సేవలకుగానూ రూ.లక్ష చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. బాధితుడికి ఇప్పుడు నిరంతరం ఎవరో ఒకరి సాయం అవసరమని పేర్కొన్నారు. సరిగ్గా నడవడానికి కూడా వీల్లేదు. అంతేకాకుండా, చికిత్స కోసం నిరంతర ఖర్చు కూడా ఉంటుంది. బాధితుడు వాహన యజమాని రాకేష్ శర్మ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ అనే బీమా కంపెనీపై కేసు పెట్టారు. బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది.