»Register A Case Against Dk Shivakumar Court Order
DK Shivakumar: డీకే శివకుమార్ పై కేసు నమోదు చేయండి.. కోర్టు ఆదేశం
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయమని స్పెషల్ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఫోటోలను మార్ఫింగ్ చేసినట్లు బీజేపీ నేతలు కోర్టులో కేసు పెట్టారు.
DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్పెషల్ కోర్టు బెంగళూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. డీకేతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఐటీ సెల్ హెడ్ బీఆర్ నాయుడుపై కూడా కేసు నమోదు చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. బీజేపీ నేతలు నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను మార్ఫింగ్ చేసిన కేసులో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన ఘటనలో పాల్గొన్న శ్రీకాంత్ పూజారి అనే కరసేవకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేశారు. ఆ ఫోటోను షేర్ చేసి నేను కూడా కరసేవకుడినే.. నన్ను కూడా అరెస్ట్ చేయండి అని రాసిన ఓ ప్లకార్డులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్లకార్డులతో ఉన్న ఫొటోను మార్ఫింగ్ చేసినట్టు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. స్కామ్ లు, అక్రమాలు జరిగినట్టుగా ప్లకార్డులపై ఉందని, ఫొటోలను మార్ఫింగ్ చేశారని వారు కేసు పెట్టారు. దీని ద్వారా రెండు వర్గాల మధ్య వైరం పెరుగుతుందని బీజేపీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ యోగేంద్ర హొడగట్ట తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫొటోను డీకే శివకుమార్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేయడంతో, ఇరు పార్టీల నడుమ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందని స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.