»A Fatal Accident In Doda District Of Jammu And Kashmir 10 People Died
Road accident: ఘోర రోడ్డు ప్రమాదం..38 మంది స్పాట్ డెడ్
జమ్ముకశ్మీర్ దోడాలో ఓ బస్సు అదుపు తప్పి దాదాపు 300 అడుగుల లోతున్న గుంతలో ఆకస్మాత్తుగా పడిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో 38 మంది మృత్యువాత చెందగా..మరికొందరికి గాయాలయ్యాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
bus and tractor collision in ap anantapur district four people died
జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని అసర్‌లో ఓ బస్సు అదుపు తప్పి ప్రమాదవశాత్తు దాదాపు 300 అడుగుల లోతున్న గుంతలో పడింది. ఈ ఘటనలో 38 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 17 మందికి గాయాలయ్యాయి. బస్సు కిష్త్వార్ నుంచి జమ్మూ వైపు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మార్గంలో మూడు బస్సులు కలిసి నడుస్తుండగా ఒకదానికొకటి ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ పెను ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.