కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు అందించింది. ప్రధాని మోదీపై ముంబయి సభలో తీవ్ర ఆరోపణలు చేసిందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని, నవంబర్ 16వ తేది లోపు నోటిసులకు రిప్లై ఇవ్వకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi)పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) విమర్శలు గుప్పించడంతో ఎన్నికల సంఘం (Election Commission) షాకిచ్చింది. మోదీపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేసిందని తమకు తమకు ఫిర్యాదు అందినట్లు వెల్లడించింది. ఆరోపణలు చేయడంపై వెంటనే సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం ప్రియాంక గాంధీకి నోటీసులు పంపింది. ఆమెకు పంపిన నోటీసుల్లో (Notices) ఎన్నికల సంఘం పలు విషయాలను తెలిపింది.
భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి తమకు నవంబర్ 10వ తేదిన ఫిర్యాదు అందినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మధ్యప్రదేశ్ (Madhyapradesh)లోని సేవర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రియాంక గాంధీపై కేసు నమోదైనట్లు పేర్కొంది. ముంబయిలో ఓ బహిరంగ ర్యాలీ జరుగుతుండగా ఆ సభలో ప్రధాని మోదీపై తప్పుడు ప్రకటనలు చేసినట్లు ఫిర్యాదు అందిందని స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రియాంక అలా ఆరోపణలు చేశారని ఫిర్యాదులో నమోదైనట్లు ఎన్నికల సంఘం వివరించింది.
మధ్యప్రదేశ్ లోని ఓ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీపై ఆ ఆరోపణలు చేసినట్లుగా ఈసీ చెప్పుకొచ్చింది. తమకు ఉపాధి కల్పించింది బెల్ కంపెనీ అని, దాని కారణంగానే దేశం బాగుపడిందని, కానీ దేశ ప్రజలకు ఉపాధి కల్పించే ప్రభుత్వ సంస్థల్ని మోదీ ఎవ్వరికి ఇచ్చారో చెప్పాలని ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు చేసింది. అలాగే తన బడా పారిశ్రామిక వేత్త స్నేహితులకు ఆ కంపెనీని ఎందుకు ఇచ్చావో చెప్పాలని ప్రియాంక ప్రశ్నించారు.
ఒక సీనియర్ నేత, జాతీయ పార్టీ స్టార్ క్యాంపెయినర్ చెప్పే మాటలను ప్రజలు కచ్చితంగా నమ్మే అవకాశం ఉందని, అటువంటి పరిస్థితిలో రుజులు లేకుండా మాట్లాడటం సరైంది కాదని, వాస్తవాలను కలిగి ఉండి ఆరోపణలు చేయాలని ఎన్నికల సంఘం తన నోటీసులో పేర్కొంది. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ నవంబర్ 16వ తేది రాత్రి 8 గంటలలోపు కారణాన్ని తెలియజేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తన నోటీసులు స్పష్టం చేసింది.