MDCL: ఉప్పల్ డివిజన్ పరిధిలో స్వచ్ఛ ఆటోకు పలువురు చెత్త వేయకపోవడంతో ఇంటింటికి సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. గణేష్ నగర్ కాలనీ, సెవెన్ హిల్స్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, ఆంజనేయ నగర్ సహా పలు ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోకు మాత్రమే చెత్త వెయ్యాలని ఉప్పల్ GHMC అధికారులు సూచిస్తున్నారు.