కర్ణాటకలోని హాసన్ ప్రాంతంలోని హాసనాంబ ఆలయంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయంలో విద్యుదాఘాతం కారణంగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 20 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్ కార్డులను కేంద్రం డీయాక్టివేట్ చేసింది. ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా.. అందులో 13 కోట్ల కార్డులు ఆధార్‌తో లింక్ కాలేదు.
భారతీయ జనతా పార్టీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వంలోని కమిటీ ఈరోజు సమావేశమై కమిటీ నివేదికను ఆమోదించింది. కమిటీలోని ఆరుగురు సభ్యులు నివేదికను ఆమోదించడాన్ని సమర్థించగా, నలుగురు వ్యతిరేకించారని సమావేశం అనంతరం సోంకర్ విలేకరులతో అన్నారు.
ఆస్పత్రిలో తన చెల్లెలు చనిపోతే ఓ అన్న బైక్‌పై మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ లేదని వైద్యులు చెప్పడంతో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను నిలదీస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
అయోధ్యలో నేడి యోగి క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చౌకైన నీటి రవాణాను అందించడంతోపాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడం అనే ద్వంద్వ లక్ష్యాలను సాధించడానికి రాష్ట్రంలో ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటు చేస్తారు.
కుల ఆధారిత రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచే ప్రతిపాదనకు బీహార్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులకు 30 శాతం రిజర్వేషన్లు లభిస్తుండగా, కొత్త ఆమోదం పొందిన తర్వాత వారు 43 శాతం రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాజకీయ నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందరూ తమ శక్తినంతా సేకరిస్తున్నారు.
దేశంలో 2019 నుంచి ఇప్పటివరకు రైల్వే జాబ్స్ వేయలేదని నిరుద్యోగ యువత కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న 3.12 లక్షలకుపైగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎక్స్ యాప్ వేదికగా 10 లక్షలకుపైగా ట్విట్లు చేస్తూ యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యం నుంచి ఉపశమనం లభించే అవకాశం కనిపించడం లేదు. ఇదిలా ఉంటే రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించే యోచనలో ఉన్నారు.
దేశ రాజధాని దిల్లీ (Delhi)లో వాయు నాణ్యత దారుణంగా క్షీణిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు.
కప్పు టీ’ తీసుకురాలేదనే అసహనంతో ఓ వైద్యుడు సర్జరీని మధ్యలోనే ఆపి వేసిన ఘటన నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. నగరంలోని మౌడా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పెనుప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని నాగౌర్‌లో రోడ్ షో నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు ఆయన ప్రచార వాహనాన్ని తాకాయి.
ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. మిజోరాంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నమోదైన పోలింగ్ శాతాన్ని ప్రకటించారు.
కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ పటేల్ కారు ప్రమాదానికి గురైంది. చింద్వారాలో ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ సైడ్ నుంచి వస్తున్న బైక్‌ను ఆయన కారు ఢీకొట్టిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలయ్యాయి.
పంజాబ్(punjab)లో రైతులు పెద్ద ఎత్తున వరి కర్రలు కాల్చడంపై(rice stubble) సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని కారణంగా ఢిల్లీ పరిధిలో భారీగా వాయు కాలుష్యం పెరుగుతుందని గుర్తు చేసింది. ఇలాంటి క్రమంలో పంజాబ్ ప్రభుత్వం వరి పొట్టు కాల్చడాన్ని తక్షణమే నిషేధించాలని ఆ ప్రభుత్వాన్ని కోరింది.