»Up The Tear Jerking Incident Ambulance Or Sisters Dead Body Was Taken Away On A Bike
UP: కన్నీళ్లు పెట్టించే ఘటన..అంబులెన్స్ లేక చెల్లి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన అన్న
ఆస్పత్రిలో తన చెల్లెలు చనిపోతే ఓ అన్న బైక్‌పై మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ లేదని వైద్యులు చెప్పడంతో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను నిలదీస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
అంబులెన్స్ లేక బైక్‌పై మృతదేహాలను తీసుకెళ్తున్న ఘటనలు దేశంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన తన చెల్లిని ఓ అన్న తన బైక్‌పై తీసుకెళ్లాడు. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఔరైయా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు యూపీ ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీస్తున్నారు.
మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తున్న వీడియో:
यह विडियो यूपी के औरैया के बिधूना सीएचसी का है, जहां एंबुलेंस न मिलने पर एक भाई ने अपनी बहन को बचाने की भरसक कोशिश की लेकिन जान बचा नहीं पाया। pic.twitter.com/oAOTBNM16Z
ఔరైయా జిల్లాలోని నవీన్ బస్తీలో ప్రతాప్ సింగ్ కుటుంబం నివశిస్తోంది. ప్రతాప్ సింగ్‌కు 20 ఏళ్ల అంజలి అనే కుమార్తె ఉంది. ప్రమాదవశాత్తూ ఆమె ఆన్ చేసి ఉండే వాటర్ హీటర్‌ను తాకింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురవ్వడంతో ఆమె అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు ఆమెను బిధునా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
తన సోదరి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య కేంద్ర సిబ్బందిని అన్న ఆయుష్ కోరాడు. అయితే అంబులెన్స్ అందుబాటులో లేదని వైద్యులు తెలిపారు. ఆఖరికి దిక్కుతోచని స్థితిలో అంజలి డెడ్‌బాడీని దుప్పటితో చుట్టి బైక్‌పై తీసుకెళ్లారు. ఉబికి వస్తోన్న దుఃఖాన్ని మింగి తన చెల్లిన ఆ అన్న బైక్‌పై కూర్చోపెట్టుకున్నాడు. అంజలి శవాన్నీ చున్నీతో తన నడుముకు కట్టుకుని ఏడుస్తూ బైక్ నడపడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఆ ఆస్పత్రిలోని డాక్టర్ అవిచల్ పాండే, డాక్టర్ కృపారామ్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. మరోవైపు యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. యోగి పాలనలో ఆరోగ్య సంరక్షణ సేవలు అధ్వానంగా ఉన్నాయంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.