CBDT : 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్..ఎందుకో తెలుసా?
ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్ కార్డులను కేంద్రం డీయాక్టివేట్ చేసింది. ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా.. అందులో 13 కోట్ల కార్డులు ఆధార్‌తో లింక్ కాలేదు.
ఆధార్ కార్డు(Aadhaar card)లతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్ కార్డులను కేంద్రం డీయాక్టివేట్ చేసింది. ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా.. అందులో 13 కోట్ల కార్డులు ఆధార్‌తో లింక్ కాలేదు. 2017 జులై 1 తర్వాత జారీ చేసిన పాన్ కార్డు(PAN card)లు మాత్రమే ఆటోమెటిక్‌గా ఆధార్‌తో లింక్ అవుతాయి. డీయాక్టివేట్ (Deactivate) చేసిన కార్డులను యాక్టివేట్ చేసుకోవడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు రూ.1000 జరిమానా విధించింది.దేశ వ్యాప్తంగా 11.5 కోట్ల పాన్ కార్డులు డీ యాక్టివ్ అయ్యాయి. నిర్ధేశిత గడువులోగా ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయని కారణంగా కార్డులను నిలిపివేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. దేశవ్యాప్తంగా 70.24 కోట్ల పాన్ కార్డు హోల్డర్లు ఉండగా.. అందులో 57.25 కోట్ల మంది పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకున్నట్లు బోర్డు పెర్కోన్నాది.
మొత్తం 12 కోట్ల మంది పాన్ కార్డు దారులు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయకపోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.గతంలో పాన్ ను ఆధార్ తో అనుసంధానించేందుకు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది కేంద్రం. ఆ తర్వాత దీన్ని జూన్ 30 వరకు పొడిగించింది. కానీ ఈసారి కూడా పొడిగిస్తుందని కచ్చితంగా చెప్పలేం. అందుకే లింక్ చేసుకోని వారు వెంటనే ఐటీ శాఖ అధికారిక వెబ్ సైట్లోకి లాగిన్ అయి ఈ ప్రక్రియ పూర్తి చేయండి.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Direct Taxes) గణాంకాల ప్రకారం జారీ చేసిన పాన్ కార్డులకు, ఆధార్ తో అనుసంధానమైన వాటి సంఖ్యకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దీంతో ఆధార్ , పాన్ లింకింగ్ ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 61 కోట్ల పాన్ కార్డులు జారీ కాగా, వాటిలో 48 కోట్లు పాన్ కార్డులు మాత్రమే ఆధార్ తో అనుసంధానమై ఉన్నాయి.
అంటే ఇకాం 13 కోట్ల పాన్ కార్డులు ఆధార్ తో లింక్ కాలేదన్నమాట. 2017 జులై 1 కంటే ముందు ఇష్యూ చేసిన పాన్ కార్డులను ఆధార్ తో లింక్ చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందరూ ఈ ప్రక్రియను పూర్తి చేసుకునేలా పలుమార్లు గడువును సీబీడీటీ (CBDT) పెంచింది. ఇక, డీయాక్టివేట్ అయిన కార్డులను పునరుద్ధరించడానికి సీబీడీటీ చాన్స్ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.వెయ్యి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 2023 జూన్ 30 గడువును మిస్ అయిన వారు పెనాల్టీ(Penalty) చెల్లించి మళ్లీ కార్డు పొందవచ్చు. కాగా.. పాన్ కార్డును తిరిగి పొందేందుకు 30 రోజుల సమయం పట్టనుంది.