»Kamal Haasan Unveiled The Statue Of Krishna At Vijayawada
Kamal haasan: కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్!
ప్రముఖ నటుడు కమల్ హాసన్ శుక్రవారం విజయవాడలో అలనాటి నటుడు నటుడు ఘట్టమనేని కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన కృష్ణుడి విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్‌తో కలిసి కమల్‌హాసన్ ఆవిష్కరించారు.
kamal haasan unveiled the statue of krishna at vijayawada
ఘట్టమనేని కృష్ణ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా ప్రేక్షకుల్లో అతనికి మంచి గుర్తింపు ఉంది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్న తిరుగులేని లెజెండ్ కృష్ణ. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. కాగా ఆక్ష్న గ్నాపకార్థం తాజాగా ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని కమల్ హాసన్(kamal haasan) ఆవిష్కరించారు. నగరంలోని గురునానక్ కాలనీలో కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ తూర్పు వైఎస్ఆర్సీపీ ఇంఛార్జీ దేవినేని అవినాష్ విగ్రహ ప్రతిష్ఠాపనకు కృషి చేశారు. ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో కమల్ హాసన్ విగ్రహాన్ని ఆవిష్కరించగా దేవినేని అవినాష్‌తో కలిసి వేడుకలో పాల్గొన్నారు. కృష్ణ వంటి గొప్ప నటుడి విగ్రహాన్ని ఆవిష్కరించడంపై కమల్ సంతోషం వ్యక్తం చేశారు.
బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ సూపర్‌స్టార్ విగ్రహావిష్కరణకు వచ్చి పాల్గొన్నందుకు కమల్‌హాసన్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని దేవినేని అవినాష్ అన్నారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే విగ్రహ ప్రతిష్ఠాపనకు సీఎం వైఎస్ జగన్ అన్ని అనుమతులు మంజూరు చేశారని అవినాష్ తెలిపారు. అందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారి అభిమాన నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజయవాడ(vijayawada)లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.