»When Will 3 12 Lakh Railway Jobs Recruitment In India Million Tweets
Railway New Vacancy: 3.12 లక్షల రైల్వే జాబ్స్ ఎప్పుడేస్తారు?..మిలియన్ ట్వీట్స్
దేశంలో 2019 నుంచి ఇప్పటివరకు రైల్వే జాబ్స్ వేయలేదని నిరుద్యోగ యువత కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న 3.12 లక్షలకుపైగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎక్స్ యాప్ వేదికగా 10 లక్షలకుపైగా ట్విట్లు చేస్తూ యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
When will 3.12 lakh railway jobs recruitment in india million tweets
దేశంలోని నిరుద్యోగ యువత(unemployed youth) ఏకమైంది. ఈ క్రమంలో ఎక్స్ యాప్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వే ఉద్యోగాల(Railway jobs) గురించి ప్రశ్నిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు రైల్వేలో ఖాళీగా ఉన్న 3.12 లక్షలకుపైగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులు రిక్రూట్ చేయకపోవడం యువతకు ద్రోహం చేయడమేనని పలువురు అనేక రకాలుగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
రైల్వే మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 1 నాటికి గెజిటెడ్, నాన్ గెజిటెడ్ కేటగిరీలలో ఈ ఏడాది మొత్తం ఖాళీల సంఖ్య 3,15,780కి చేరింది. నాన్ గెజిటెడ్ పోస్టుల్లో ఇంజనీర్లు, టెక్నీషియన్లు, క్లర్కులు, స్టేషన్ మాస్టర్లు, టిక్కెట్ కలెక్టర్లు తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 18 జోన్ల పరిధిలో 2,885 గెజిటెడ్ పోస్టులు, 3,12,9895 నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా(Railway New Vacancy) ఉన్నాయని అధికారిక డేటా చెబుతోంది. అదనంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు, OBC కేటగిరీలలో కనీసం 18,670 ఖాళీలు ఉన్నాయి. జనవరి 1, 2023 నాటికి రైల్వేలో ఎస్సీ కేటగిరీలో 6,112, ఎస్టీలో 5,113, ఓబీసీలో 7,427 ఖాళీలు ఉన్నాయి.
వీటిలో ఉత్తర రైల్వేలో అత్యధికంగా 38,754 ఖాళీలు ఉన్నాయని, పశ్చిమ రైల్వేలో 36,476, తూర్పు రైల్వేలో 30,141, సెంట్రల్ రైల్వేలో 28,650 ఖాళీలు ఉన్నాయని, మిగిలిన జోన్లలో 28,650 ఖాళీలు ఉన్నాయని సోర్సెస్ నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ప్రతి ఏడాది వేల మంది రైల్వే ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో రైల్వే ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉద్యోగార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే ఆయా జోన్ల పరిధిలో ఖళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రైల్వే మంత్రి, ప్రధాని మోడీని వ్యతిరేకిస్తూ యువత పలురకాలుగా ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఎక్స్ యాప్‌లో Railway_New_Vacancy హ్యాష్ ట్యాగ్‌లో 1.5 మిలియన్ల ట్విట్లు దాటి పోయాయి.