మిస్టర్ మస్క్(Elon Musk) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్లో మిస్టర్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg)తో "కేజ్ ఫైట్‌కు సిద్ధంగా ఉన్నానని" సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా బాస్ అయిన మిస్టర్ జుకర్‌బర్గ్, "నాకు లొకేషన్ పంపండి" అనే క్యాప్షన్‌తో మిస్టర్ మస్క్ ట్వీట్ యొక్క స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ప్రముఖ టెక్ దిగ్గజాలు, ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్ లు తెలియనివారు ఉండరు. ఎలాన్ మస్క్(Elon Musk) టెస్లా అధినేత కాగా, జుకర్ బర్గ్(Mark Zuckerberg) ఫేస్ బుక్ అధినేత. ఇప్పుడు వీరిద్దరూ ఓ పోటీ కి సై అంటున్నారు. కేజ్ మ్యాచ్ లో వీరు తలపడటానికి రెడీ అయ్యారు. కేజ్ మ్యాచ్‌కు సిద్ధంగా ఉండాలని జుకర్‌బర్గ్‌కు మస్క్‌కు సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించిన జుకర్‌బర్గ్ అడ్రస్ ఎక్కడో చెప్పంటూ ప్రతి సవాల్ విసిరారు. ఈ సవాళ్లు ప్రతి సవాళ్లతో కూడిన ఈ సరదా ట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. సోషల్ మీడియాలో మెటా ఆధిపత్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మస్క్ సరదాగా కేజ్ ఫైట్ చేద్దామంటూ ట్వీట్ చేశారు.
దీనికి అనూహ్యంగా జుకర్‌బర్గ్ స్పందించాడు. మస్క్ ట్వీట్‌ను ఇన్స్టాగ్రామ్(instagram)లో పోస్ట్ చేసిన జుకర్‌బర్గ్.. కేజ్ ఫైట్‌కు అడ్రస్ చెప్పు అంటూ ప్రతి సవాల్ విసిరాడు. లాస్ వెగాస్‌లో పోరుకు సిద్ధంగా ఉండాలని మాస్క్ సూచించాడు. కుబేరుల మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. జుకర్‌బర్గ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాడు. ఇటీవల జియు-జిట్సు టోర్నమెంట్ కూడా గెలుచుకున్నాడు. మరి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన జుకర్ బర్గ్ చేతిలో ఎలన్ ఓడిపోవడం ఖాయమని నిపుణులు కామెంట్స్ చేస్తున్నారు.