»Happy Childrens Day 2023 Best Top 5 Plans For Your Child Financial Future
ChildrensDay: మీ పిల్లల ఆర్థిక భవిష్యత్తుకు బెస్ట్ ప్లాన్స్!
నేడు బాలల దినోత్సవం(happy children's day). ఈ సందర్భంగా పిల్లల భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం ప్రణాళిక వేయడం అనేక మందికి ఒక సవాలుతో కూడుకున్న పని. ఈ క్రమంలోనే ప్రస్తుతం మార్కెట్లో కొన్ని పిల్లల పెట్టుబడి కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు చుద్దాం.
Happy Children's Day 2023 Best top 5 plans for your child financial future
భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా..ఆయన గౌరవార్థం ప్రతి ఏటా నవంబర్ 14 న భారతదేశం అంతటా బాలల దినోత్సవం లేదా బాల్ దివాస్ జరుపుకుంటాము. ఇతనిని చాచా నెహ్రూ అని కూడా పిలుస్తారు. ఇతనికి పిల్లల పట్ల అంకితభావం, ప్రేమకు గుర్తుగా ‘నవంబర్ 14’న దేశంలో బాలల దినోత్సవంగా జరుపుతున్నాము. అయితే ఈ నేపథ్యంలో అసలు పిల్లల ఆర్థిక భవిష్యత్తు గురించి కొన్ని ప్లాన్స్ ఇప్పుడు చుద్దాం.
సుకన్య సమృద్ధి స్కీం
సుకన్య సమృద్ధి స్కీం అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. తల్లిదండ్రులు వారి ఆడపిల్లల పొదుపు కోసం ఇది మంచి పెట్టు బడి అని చెప్పవచ్చు. మీ కుమార్తెకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఏదైనా పోస్టాఫీసులో ఖాతాను తెరవవచ్చు. కనీస డిపాజిట్ రూ.1000 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆడపిల్లకు 14 సంవత్సరాలు వచ్చే వరకు డిపాజిట్లు చేయవచ్చు. ఖాతా మెచ్యూరిటీ వ్యవధి ఖాతా తెరిచిన రోజు నుంచి 21 సంవత్సరాల వరకు ఉంటుంది. వడ్డీ రేటు 8.6%. ఈ పథకం పిల్లలకి 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పాక్షిక ఉపసంహరణలను కూడా అనుమతిస్తుంది.
బంగారంలో పెట్టుబడి
ఈక్విటీకి వ్యతిరేకంగా మార్కెట్లు అస్థిరంగా ఉన్న సమయాల్లో బంగారం ఎల్లప్పుడూ ఖచ్చితమైన రక్షణగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఇటిఎఫ్ లేదా ఇ-గోల్డ్ లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చు. బంగారం భౌతిక నిల్వతో సంబంధం ఉన్న నష్టాన్ని తగ్గించడానికి ఈ పెట్టుబడులు మంచి పద్ధతి అని చెప్పవచ్చు. ఈ పెట్టుబడి భవిష్యత్తులో పిల్లల ఖర్చు అవసరాల కోసం నగదును పొందేందుకు ఉపయోగపడుతుంది.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు ప్రస్తుతం పిల్లల పెట్టుబడి ప్రణాళికలో ఉన్నత స్థానంలో ఉన్నాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు 10-15 సంవత్సరాల సుదీర్ఘ కాలపరిమితి అందుబాటులో ఉన్న పెట్టుబడి విధానం. ఈక్విటీ ఫండ్లు ఎల్లప్పుడూ వార్షిక రాబడిగా 12% నుంచి 15% వరకు గరిష్టంగా వడ్డీ లభిస్తుంది.
రికరింగ్ డిపాజిట్ల పెట్టుబడులు
మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం తక్కువ రిస్క్ పెట్టుబడి ప్రణాళిక కోసం చూస్తున్నట్లయితే, తల్లిదండ్రులు రికరింగ్ డిపాజిట్లను పరిగణించవచ్చు. ఎందుకంటే వీటికి వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉంటాయి. RDలను లాక్ చేసి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవచ్చు. భారతదేశంలోని రెండు బ్యాంకులు అలాగే పోస్టాఫీసుల ద్వారా రికరింగ్ డిపాజిట్లు అందిస్తున్నాయి. ఉదాహరణకు పెట్టిన పెట్టుబడి నెలకు రూ.1000 మీరు 10 సంవత్సరాల తర్వాత రూ.2 లక్షలు పొందవచ్చు.
PPFలో పెట్టుబడులు
మీరు దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే 15 సంవత్సరాల కాలవ్యవధికి ఫండ్లు లాక్ చేయబడే PPFని ఎంచుకోండి. PPF కాలిక్యులేటర్‌తో, నిర్దిష్ట వడ్డీ రేటు, ప్రారంభ పెట్టుబడిని బట్టి మీరు కాలక్రమేణా మీ PPF పెట్టుబడి వృద్ధి రేటును నిర్ణయించవచ్చు. సంవత్సరానికి కనీసం 1 లక్ష పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేటు సంవత్సరానికి 8.75 %. PPF ఖాతాలను పోస్టాఫీసులు లేదా బ్యాంకుల ద్వారా తెరవవచ్చు.
ULIPలో పెట్టుబడి
చాలా మంది ULIP పథకాలను ఇష్టపడనప్పటికీ తక్కువ-రిస్క్ పెట్టుబడిదారులకు ఇవి అనువైన ఎంపికలు. ఏదైనా ULIP పథకాల నుంచి సంవత్సరానికి 4% నుంచి 6% వరకు రాబడిని ఆశించవచ్చు. అయితే అందుబాటులో ఉన్న ఇతర చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లతో పోల్చినప్పుడు ULIP పథకాలు చివరి ఎంపికగా ఉండాలని గుర్తుంచుకోండి