»40 Workers Feared Trapped As Under Construction Tunnel Collapses In Uttarakhand
Uttarakhand: కూలిన సొరంగం..శిథిలాల కింద 40 మంది!
యమునోత్రి జాతీయ రహదారిలో నిర్మిస్తున్న సొరంగంలో కొంత భాగం ఒక్కసారిగా కూలింది. ఆ సొరంగం శిథిలాల కింద 40 మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది.
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తరకాశీ (Uttarkashi)లో ఓ సొరంగం కూలింది. యమునోత్రి జాతీయ రహదారిలో నిర్మిస్తున్న ఈ సొరంగం ఒక్కసారిగా కూలింది. సొరంగం శిథిలాల కింద 40 చిక్కుకోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాణ నష్టం అవకాశం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Uttarakhand: A part of the tunnel under construction from Silkyara to Dandalgaon in Uttarkashi, collapsed. DM and SP of Uttarkashi district are present at the spot. SDRF, and Police Revenue teams are also present at the spot for relief work. Rescue operations underway. pic.twitter.com/hxrGqxWrsO
సొరంగం ప్రారంభం నుంచి 200 మీటర్ల దూరంలోని భాగం ఒక్కసారిగా కూలిందని జిల్లా ఎస్పీ అర్పణ్ యదువంశీ తెలిపారు. దాదాపు 40 మంది సొరంగం లోపల ఉన్నారని, వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్లో ఈ ఏడాదంతా భారీగా వర్షాలు పడ్డాయి. భారీ వర్షాల వల్ల అనేక భవనాలు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
హైవేలపై ప్రమాదాల వల్ల ఇప్పటి వరకూ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఆగస్టులో శివపురి ప్రాంతంలో వరద ప్రవాహం వల్ల రిషికేశ్, కర్ణ ప్రయాగ్ రైలు మార్గం ప్రాజెక్టులో భాగమైన సొరంగంలో 114 మంది చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే రెస్క్యూ సిబ్బంది తాళ్ల సాయంతో వారిని కాపాడారు. తాజాగా ఇప్పుడు మరో సొరంగంలో 40 మంది చిక్కుకుపోవడంతో అధికారులు వారిని కాపాడే చర్యలు చేపట్టారు.