»Nita Ambani On The Day Of Her Birth The Beginning Of A New Chapter
Nita Ambani: పుట్టిన రోజు నాడు.. నూతన అధ్యాయానికి శ్రీకారం
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ పుట్టిన రోజు సందర్భంగా బోధన, అభ్యాసంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కొత్తగా 'నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్‌ను ప్రారంభించారు.
Nita Ambani: రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. నవంబర్ 1న నీతా పుట్టినరోజు సందర్భంగా బోధన, అభ్యాసంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కొత్తగా ‘నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ (Nita Mukesh Ambani Junior School)’ను ప్రారంభించారు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS ) క్యాంపస్‌కు పక్కన కొత్త పాఠశాలను ప్రారంభించారు. అత్యాధునిక క్యాంపస్‌గా దీన్ని తీర్చిదిద్దారు.
Nita Mukesh Ambani Junior School (NMAJS) was unveiled in Mumbai today. Located adjacent to the Dhirubhai Ambani International School (DAIS) campus at Bandra-Kurla Complex, this new school has been conceptualised and designed as a state-of-the-art campus, with flexible learning… pic.twitter.com/vr1UfhrHUu
ఇక్కడ బోధన ఆనందాన్ని కలిగిస్తుంది. డీఏఐఎస్ ద్వారా దశాబ్దాలుగా వేలాది మంది పిల్లలు చదువుకుంటున్నారని అన్నారు. నీతా అంబానీ పుట్టిన రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేశారు. ముంబైలో సుమారు 3వేల మంది అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. నీతూ చేతుల మీదుగానే పిల్లలందరికి వడ్డించారు. తర్వాత పిల్లలతో కేక్ కట్ చేసి బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకున్నారు. వారితో సరదాగా గడిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Founder and chairperson of Reliance Foundation Nita Ambani with over 3000 underprivileged kids at 'Anna Seva' in Mumbai on the occasion of her 60th birthday, yesterday. pic.twitter.com/ULMUdgTlQY