దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా ఎన్నెన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు గ్లోబల్ స్టార్ డమ్ ఇచ్చింది. అలాగే ఆస్కార్ లెవల్లో అరుదైన ఘనత అందుకున్నారు.
Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక తెలుగు సినిమాలకు ఎప్పుడు అందని ద్రాక్షగా ఉండే ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాడు. ఇక పాన్ ఇండియా బౌండరీస్ దాటి గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. దాంతో పాటు.. ఈ ఇద్దరిని అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో చేరేలా చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అకాడమీలోని ప్రతిష్టాత్మకైన యాక్టర్స్ బ్రాంచ్‌లో మెంబర్‌గా చేరాడు.
ఎన్టీఆర్ ఆస్కార్ అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో చేరడం అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గర్వకారణం. ఇప్పుడు ఇదే లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా చేరిపోయాడు. అకాడమీ కొత్తగా ప్రకటించిన యాక్టర్స్ బ్రాంచ్ లిస్టులో చరణ్ ఉన్నాడు. ఆస్కార్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ గుడ్ న్యూస్ రాసుకొచ్చింది. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మరోవైపు ఆస్కార్స్ లో తెలుగువారికి ప్రాధాన్యత పెరుగుతుండటంతో సంతోషిస్తున్నారు.
ఆస్కార్స్ యాక్టర్స్ బ్రాంచ్ లో సభ్యుడిగా చేరడం వల్ల అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్న నటీనటులకు ఎన్నుకునే అర్హత లభిస్తుంది. మొత్తంగా మొన్న ఎన్టీఆర్, ఇప్పుడు రామ్ చరణ్ పేరు ప్రైడ్ మూమెంట్‌గా మారింది. చరణ్ ప్రస్తుతం శంకర్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయనున్నాడు.