బాలీవుడ్‌తో పాటు సౌత్ ఆడియెన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న షారుఖ్ ఖాన్ 'డంకీ' టీజర్ రిలీజ్ అయిపోయింది. మరి రాజ్ కుమార్ హిరాణీ డైరెక్ట్ చేసిన డంకీ టీజర్ ఎలా ఉంది?
Dunky: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు ఈ ఇయర్ బర్త్ డే ఎంతో స్పెషల్‌గా నిలవనుంది. గత కొన్నాళ్లుగా బ్యాడ్ టైం ఫేజ్ చేసిన బాద్షా.. ఈ ఏడాదిలో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే.. ఒకే సంవత్సరంలో రెండు వెయ్యి కోట్ల సినిమాలు సాధించిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. అంతేకాదు.. ఇయర్ ఎండింగ్లో హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టిండానికి రెడీ అవుతున్నాడు. పఠాన్, జవాన్ జోష్‌లో డంకీ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు షారుఖ్. బాలీవుడ్ మెస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ డంకీ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ లేటెస్ట్గా రిలీజ్ చేసిన డంకీ టీజర్లో మాత్రం డేట్ వేయలేదు. నవంబర్ 2న షారుక్ పుట్టిన రోజు వేడుకలు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా డంకీ డ్రాప్ వన్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు.
ముందస్తు అప్డేట్ లేకుండానే ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ చూస్తే.. రాజ్ కుమార్ మార్క్ క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. త్రీ ఇడియట్స్ లాగే డంకీ కూడా అదిరిపోయే ఎంటర్టైనర్ అని చెప్పేశాడు. హీరోతో పాటు ఉండే నలుగురు ఫ్రెండ్స్ ఇల్లీగల్‌గా లండన్ వెళ్లడానికి ఏం చేశారు? అనే కాన్సెప్ట్‌తో డంకీ తెరకెక్కినట్టుగా టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో షారుఖ్ కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. తాప్సీ హీరోయిన్గా నటిస్తోంది. ఓపెనింగ్ షాట్‌ను ఎడారిలో ఓపెన్ చేసి టెర్రర్ ఎటాక్ చూపించి.. నెక్స్ట్ ఫ్రేమ్ నుంచి కామెడికీ షిప్ట్ అయిపోయాడు రాజ్ కుమార్. కానీ అండర్ కరెంట్ ఎమోషనల్ జర్నీ అదిరిపోతుందని చెప్పేశాడు. మొత్తంగా ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్‌గా డంకీ రాబోతోంది. హార్డీగా షారుఖ్, మనుగా తాప్సి, ఇతర ముఖ్య పాత్రల్లో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ నటిస్తున్నారు. అన్నట్టు త్వరలోనే డంకీ డ్రాప్ 2 రిలీజ్ చేయనున్నారు.