కేరళలోని కొచ్చిలో జరిగిన పేలుళ్లతో రాష్ట్రం మొత్తం ఉళిక్కిపడింది. ఎర్నాకుళం జిల్లాలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన మూడు పేలుళ్లలో ముగ్గురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తానే సూత్రధారిణని డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి దాడి జరిగిన అనంతరమే హొస్సూర్ పోలీసుల ముందు లొంగిపోయారు.
భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి వరుస బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేగుతోంది. మెయిల్ పంపిన.. ఆగంతకులు తొలుత రూ.20 కోట్లు, రెండోసారి రూ.200 కోట్లు ముడో సారి 400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కేసులో వైభవ్ గెహ్లాట్‌ను ఈడీ విచారణకు పిలిచింది.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ ఖైరాగఢ్ చేరుకున్నారు. ఆయన ఎనిమిది ఎన్నికల వాగ్దానాలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే సిలిండర్ రీఫిల్‌పై రూ.500 సబ్సిడీ ఇస్తామని ప్రియాంక గాంధీ చెప్పారు. రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను కూడా అందించనున్నారు.
చలికాలం వచ్చిందంటే ఢిల్లీలో కాలుష్య సమస్య మరింత తీవ్రంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని CAQM GRAP విధానాన్ని అమలు చేసింది. GRAP 2 ప్రస్తుతం ఢిల్లీలో వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, రాజస్థాన్, పంజాబ్ నుంచి వచ్చే డీజిల్ బస్సులను నవంబర్ 1 నుంచి ఢిల్లీలో నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
కరోనా వైరస్ కారణంగా దేశంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య సంచలన వ్యాఖ్య చేశారు. ఇంతకుముందు కోవిడ్ సోకి తగ్గిపోయిన వారే ఎక్కువగా దీని బాధితులు అయ్యారన్నారు.
మరాఠా రిజర్వేషన్ ఉద్యమం హింసాత్మకంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. బీడ్‌లోని ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే నివాసంపై ఆందోళనకారులు సోమవారం దాడి చేశారు.
జమ్మూకశ్మీర్‌లో ఒక ఉత్తరప్రదేశ్ వలస కూలీని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటనతో పుల్వామాలోని పోలీసులు వాహనాలను, పాదాచారులను తనిఖీలు చేస్తున్నారు.
ముంబై వాసులు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ఈ కాలీ పీలి ట్యాక్సీలే సేవలు అందించేవి. బ్లాక్, ఎల్లో రంగులతో కనిపించే ఈ కార్లు పద్మినీ కంపెనీవి. కాలం చెల్లిన ప్రీమియర్ పద్మినీ ట్యాక్సీలు చాలా కాలంగా నడుస్తున్నాయి. నేటితో వీటికి ముంబై వాసులు వీడ్కోలు పలుకుతున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటూ.. పలు అంశాలపై తనదైన శైలీలో చమత్కరించే మంత్రికి ఓ వింత అభ్యర్థన ఎదురైంది. తన లవర్‌తో ఫస్ట్ టైమ్ డేట్‌కు వెళ్తున్న ఓ యువకుడు డబ్బులు కావాలని అభ్యర్ధించాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలుపాలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
నవంబర్ నెలలో సగం రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఆరు సెలవులు ఉన్నాయి. ఇకపోతే మిగిలిన రోజుల్లో ఏయే సెలవులు ఉన్నాయో వివరంగా తెలుసుకోండి.
కేరళలో ప్రార్థనా సమావేశంలో పేలుడు సంభవించడంతో ఢిల్లీ, ముంబైలలో హై అలర్ట్ ప్రకటించారు. యూపీ సహా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పోలీసులు నిఘా పెంచారు.
బీహార్‌లోని నవాడా జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో మృతదేహం లభ్యం కావడం సంచలనం రేపుతోంది. మృతదేహాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ సమీప బంధువు పీయూష్ సింగ్‌గా గుర్తించారు.