ప్రభుత్వ ఉద్యోగులకు అసోం ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. మొదటి భార్య ఉండగా.. రెండో వివాహం చేసుకోకూడదని స్పష్టం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వస్తే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తేల్చిచెప్పింది.
హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించి..ఆ తర్వాత వివిధ రకాల చట్టాల గురించి ప్రస్తావించారు.
కీలక మంత్రి పదవిలో ఉండి కూడా రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో కూడా అవినీతి చేశారనే ఆరోపణలోచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ పశ్చిమ బెంగాల్లో రేషన్ పంపిణీ స్కాం(ration scam) విషయంలో మంత్రి జ్యోతిప్రియ మాలిక్‌ను విచారించి ఈరోజు తెల్లవారుజామున అరెస్టు చేసింది.
హర్యానాలోని యమునానగర్-జగాద్రి రైల్వే స్టేషన్‌లో గురువారం బెదిరింపు లేఖ వచ్చింది. ఆ లేఖలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పేరు రాసి ఉంది. లేఖపై సమాచారం అందుకున్న భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
ఓ వ్యక్తి ఎన్నికల బరిలో నిలిచాడు. ప్రజలను ఆకర్షించేందుకు ఆ వ్యక్తి గాడిదపై ఊరేగాడు. ఆ అభ్యర్థికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా రాస్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. రాస్ ఫెస్టివల్ సందర్భంగా ఎప్పటిలాగే రూ.100లకు లాటరీ టిక్కెట్లను విక్రయించనున్నారు. అందులో మొదటి బహుమతిగా రూ.76 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ కారును ఇవ్వనున్నారు. అలాగే మిగిలిన బహుమతులు కూడా ఖరీదైన కార్లనే ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో లాటరీ టిక్కెట్ల కోసం జనాలు ఎగబడుతున్నారు.
ఉత్తర కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని ఆర్మీ సైనికులు భగ్నం చేసి ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు.
ఐదేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ(modi) గురువారం షిర్డీ సాయిబాబా ఆలయానికి చేరుకున్నారు. ఆ క్రమంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని..దేవాలయంలో కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్‌ను PM ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు పాల్గొన్నారు.
కిర్గిస్థాన్ వేదికగా షాంఘై సహకార సదస్సు జరుగుతుంది. ఈ సమావేశం ప్రారంభం సందర్భంగా మన భారతదేశపు పాటతో మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను భారత విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్‌గా మారింది.
ఏకంగా హేమమాలినితోనే డ్యాన్స్ చేయించామని మంత్రి కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు అస్వస్థతకు గురయ్యారు.
భారత్లో నీటి కష్టాలు మరో రెండేళ్లలో తీవ్రం కానున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అధిక వేడి వాతావరణం, కరువు వంటి అంశాల నేపథ్యంలో భూగర్భ జలాలపై ఆధారపడటం క్రమంగా పెరిగినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో దేశంలో పలు ప్రాంతాలకు నీటి కష్టాలు తప్పవని రిపోర్ట్ హెచ్చరించింది.
ఓ కానిస్టేబుల్ సాహసం చేసి మరీ పాముకు పాలు పోయడం కాదు ఏకంగా ప్రాణమే పోశాడు.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఫెమా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి కుమారుడు వైభవ్ గెహ్లోత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతోపాటు ఆ రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
పాతాల్కిట్ ఎక్స్ ప్రెస్ బోగీలు మంటలు చెలరేగాయి. దీంతో 13 మంది గాయపడ్డారు. సమీపంలోని ఆస్పత్రుల్లో వారికి చికిత్స అందజేస్తున్నారు.