మధ్యప్రదేశ్ (Madhyapradesh)లో ఎన్నికల జోరు ఎక్కువయ్యింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు రకరకాలుగా ప్రజలను ఆకర్షించే పనులు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు చేసే ఫీట్లు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారం రోజుకో విధంగా మారుతోంది. అయితే తాజాగా ఓ అభ్యర్థి చేసిన పని అందర్నీ నవ్వుకునేలా చేస్తోంది. బుర్హాన్పూర్ వీధుల్లో ఆ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నామినేషన్ వేయడానికి గాడిద (Donkey)పై ఊరేగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది.
బుర్హాన్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections-2023) స్వతంత్ర అభ్యర్థిగా ఠాకూర్ ప్రియాంక్ సింగ్ (Takur Priyank singh) పోటీ చేస్తున్నాడు. ఈ తరుణంలో ఎన్నికల నామినేషన్ వేయడానికి వినూత్న రీతిలో ఆలోచించాడు. అందరూ కార్ల కాన్వాయ్‌తో వెళ్లి నామినేషన్స్ వేస్తే ఠాకూర్ ప్రియాంక్ సింగ్ మాత్రం అలా కాకుండా కొత్తగా ఆలోచించాడు. రిటర్నింగ్ కార్యాలయానికి గాడిదపై వచ్చాడు. నామినేషన్ ఫారమ్ సమర్పించేందుకు గాడిదపై వచ్చిన ప్రియాంక్ సింగ్‌ను అందరూ ఫక్కున నవ్వుకున్నారు.
ఠాకూర్ ప్రియాంక్ సింగ్ గాడిదపై (Man Rides Donkey) వస్తుంటే ఆయన మద్దతుదారులంతా ర్యాలీగా ఆయనతో పాటే వచ్చారు. రోడ్డుపై అందరూ ఆయన్ని అలా చూస్తుండిపోయారు. ఈ కొత్త విధానం గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు ఇప్పుడు ఇలాంటి ఘటనలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది.