పాము (Snake)కు ఎవరైనా పాలుపోస్తారు మనం సహజంగానే వింటుంటాం. కానీ అక్కడ మాత్రం ఓ కానిస్టేబుల్ సాహసం చేసి మరీ పాముకు పాలు పోయడం కాదు ఏకంగా ప్రాణమే పోశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సరైన సమయంలో సీపీఆర్ (CPR) ఇచ్చి ప్రాణాలను కాపాడవచ్చని అందరికీ తెలుసు.తాజాగా, ఇలాంటి అరుదైన ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాదాపు సగం చచ్చిపోయిన పామును ఓ పోలీసు కానిస్టేబుల్ (Constable) బతికించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) నర్మదాపురం జిల్లాలోని సేమరి హరిచంద్ పోలీస్ పోస్ట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంటి వద్దకు ఇటీవల ఓ పాము (snake) వచ్చింది. దీంతో భయపడిపోయిన స్థానికులు పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఆ పాము ఓ పైపులోకి దూరింది. దీంతో చివరకు దాన్ని చంపే క్రమంలో అందులో వారు పురుగుల మందు పోశారు. ఈ మందు తాగడంతో పాము అపస్మారక స్థితికి చేరుకుంది.
సమాచారం అందుకున్న అతుల్ శర్మ (Atul Sharma) అనే కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని పామును పరిశీలించాడు. వెంటనే దాన్ని పక్కకు తీసుకెళ్లి నీళ్లు పోసి శుభ్రం చేశాడు. సకాలంలో కానిస్టేబుల్ పామును కాపాడిన తీరు గమనించిన నెటిజన్లు (Netizens) ఆయనకు ఫిదా అయ్యారు. ఆయన ధైర్యానికి హ్యాట్సాప్ అంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా విషపురితమైన పామే అయినా ప్రాణంతో ఉండాల్సిన జీవే కదా అని కానిస్టేబులు చూపించిన సాహసంతో కూడిన చొరవ మాత్రం ఆదర్శప్రాయమనే చెప్పాలి.
A police constable in Madhya Pradesh is giving CPR to a snake that had fallen unconscious after being exposed to pesticide-laced water. The constable, Atul Sharma, used mouth-to-mouth resuscitation to revive the snake, which was later released safely.#Viral#Snake#CPRpic.twitter.com/2uwV957jTf