»Aashiqui 2 Song At Shanghai Conference Held In Kyrgyzstan Jayashankars Post Viral
SCO meet: షాంఘై సదస్సులో ఆషీకీ2 సాంగ్..జయశంకర్ పోస్ట్ వైరల్
కిర్గిస్థాన్ వేదికగా షాంఘై సహకార సదస్సు జరుగుతుంది. ఈ సమావేశం ప్రారంభం సందర్భంగా మన భారతదేశపు పాటతో మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను భారత విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్‌గా మారింది.
Aashiqui 2 song at Shanghai conference held in Kyrgyzstan... Jayashankar's post viral
SCO meet: కిర్గిస్థాన్ వేదికగా షాంఘై సహకార సదస్సు (SCO meet) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓ అరుదైన ఘటన జరిగింది. భారతీయ పాట సినిమా సాంగ్‌తో (Indian song) ఈ వేడుకను ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
బుధవారం సాయంత్రం జరిగిన ఈ సదస్సు ప్రారంభోత్సవంలో బాలీవుడ్ చిత్రం ఆషికీ 2 (Aashiqui 2)లోని తుమ్ హి హో (Tum Hi Ho) పాటను గాయకులు లైవ్‌లో ఆలపించారు. ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్దా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మ్యూజికల్‌గా ఎంతో హిట్ అయిందో అందరికి తెలిసిందే. అలాంటి రోమాంటిక్ సాంగ్‌ను గాయాకులు అద్భుతంగా పాడి అందరినీ ఆకట్టుకున్నారు. కిర్గిస్థాన్‌లోని బిష్కెక్లో ప్రారంభమైన ఈ సదస్సుకు ప్రధానమంత్రి మోడీ తరఫున ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ఈ సదస్సులో భాగంగా సభ్య దేశాల మంత్రులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. షాంఘై సహకార సదస్సు గ్రూప్‌లో భారత్, చైనా, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, పాకిస్థాన్, రష్యా, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.