»Ed Searches Rajasthan Congress President Govind Singh Dotasras House Ed Summons To Vaibhav Gehlot
ED Rides: రాష్ట్రంలో ఎన్నికలు..కాంగ్రెస్ ఛీఫ్ ఇంట్లో ఈడీ సోదాలు
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఫెమా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి కుమారుడు వైభవ్ గెహ్లోత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతోపాటు ఆ రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
ED searches Rajasthan Congress President Govind Singh Dotasra's house ED summons to Vaibhav Gehlot
ED Rides: ఈ ఏడాది మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇంకో నెలరోజులు గడువు ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజస్థాన్(Rajasthan)లో ఈడీ(ED) అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్రా, మహువా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ (Ashok Gehlot) కుమారుడు వైభవ్ గహ్లోట్(Vaibhav Gehlot)కు గురువారం ఈడీ సమన్లు జారీ చేసింది.
ఫెమా(విదేశీ ద్రవ్య నిర్వాహణ చట్టం) నిబంధనలు ఉల్లంఘించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్లు తెలిస్తోంది. అక్టోబరు 27న ఈ కేసుకు సంబంధించిన విచారణకు దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడీ (ED) పేర్కొంది. ఇక పరీక్షా పత్రం లీక్ (exam paper leak)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు (money laundering case) దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో సోదాలు చేపట్టింది. జైపూర్‌లో గోవింద్ సింగ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీస్‌లో గురువారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. అలాగే మహువా కాంగ్రెస్ అభ్యర్థి ఓం ప్రకాశ్ హుడ్లా నివాసంలో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు నెల రోజులు ఉందనగా ఈడీ సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘అక్టోబరు 25న, రాజస్థాన్ మహిళల కోసం కాంగ్రెస్ హామీలు ప్రకటించింది. తరువాతి రోజు రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్‌పై ఈడీ దాడులకు దిగింది. ఆయన కుమారుడు వైభవ్‌కు సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో మహిళలు, రైతులు, పేదలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రయోజనాలను పొందాలని బీజేపీ భావించడం లేదు. అందుకే ఈడీతో ఇలా ఎర్ర గులాబీలు పంపిస్తోందని నేను చాలా సార్లు చెప్పాను. నా మాటలు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటాయి’’ అని గహ్లోత్ వ్యంగ్యంగా రాసుకొచ్చారు.